ఆర్థిక మంత్రితో మాట్లాడుతున్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఫ్యాక్టరీ యజమానులు
జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పెంపు వల్ల నాపరాతి పరిశ్రమలపై భారం పెరిగి పోయిందని, ఇదే కొనసాగితే పరిశ్రమలు నడపలేమని బేతంచెర్ల ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
- జీఎస్టీ భారంపై బేతంచెర్ల ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన
- బుగ్గన ఆధ్వర్యంలో ఆర్థికమంత్రితో భేటీ
బేతంచెర్ల : జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పెంపు వల్ల నాపరాతి పరిశ్రమలపై భారం పెరిగి పోయిందని, ఇదే కొనసాగితే పరిశ్రమలు నడపలేమని బేతంచెర్ల ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని విజయవాడలోని ఆయన చాంబర్‌లో కలిశారు.
ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మారుతి కృష్ణ, మిలాప్‌చంద్, చలంరెడ్డి, సుబ్బారావు, సంజయ్, స్వరూప్ తదితరులు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను మంత్రికి వివరించారు. పన్ను 5 శాతం నుంచి 28 శాతానికి పెరగడంతో పరిశ్రమలు నడుపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి.. ఆగస్టులో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విషయంపై ప్రస్తావించి పన్ను తగ్గింపునకు కృషి చేస్తామని చెప్పినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.