పులివెందుల రూరల్, న్యూస్‌లైన్ :వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతానికి నాయకులు, కార్మికులు కృషి చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నూతన డివిజనల్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనియన్ స్థాపించిన అనతి కాలంలో ఎంతో బలపడిందని, మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐక్యంగా పోరాటం చేసి సాధించాలన్నారు.
కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండు చేశారు. రాష్ట్ర వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు బాషా మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు పరిష్కరించడంలో యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తోందన్నారు. అనంతరం 327 యూనియన్ నుంచి కొండారెడ్డి, మోహన్ రామిరెడ్డి, పెద్దన్నతోపాటు మరికొంతమంది వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు.
నూతన కార్యవర్గం ఎంపిక : పులివెందుల డివిజనల్ వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజనల్ అధ్యక్షుడుగా నాగేంద్ర ప్రసాద్, డివిజనల్ సెక్రటరీగా మంజునాథరెడ్డి, ట్రెజరర్‌గా గంగాధర, అదనపు సెక్రటరీగా బాబావల్లితో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ బలోపేతానికి కృషి చేద్దాం
Published Tue, Feb 18 2014 2:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement