విజయవాడ (లబ్బీపేట): రాష్ట్రంలో గ్రానైట్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఏపీజీఐ) చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన గ్రానైట్ ఇండస్ట్రీస్, క్లస్టర్స్ యజమానుల సమావేశం ఆదివారం విజయవాడలోని హోటల్ గేట్‌వేలో జరిగింది. ఈ సమావేశంలో 13 జిల్లాలతో కూడిన నూతన ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీని ఏర్పాటుచేశారు. ఫెడరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడి లక్షలాదిమంది జీవనోపాధి పొందుతున్నారన్నారు. తమ ఇండస్ట్రీకి ప్రభుత్వపరంగా ఏం చేయాలి, ప్రభుత్వానికి తామేమి చేయాలనే దానిపై ఫెడరేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సుమారు 200 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు.
ఫెడరేషన్ కార్యవర్గం
ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వరరావు(ప్రకాశం), వైస్ చైర్మన్లుగా కోట మురళీధర్(శ్రీకాకుళం) అంగర రాజేష్(విశాఖపట్నం), మారం వెంకరెడ్డి(ప్రకాశం), ఆర్.లక్ష్మీనారాయణ (ప్రకాశం), కె.వి.శ్రీనివాస్(చిత్తూరు), బి.సుశీల్‌కుమార్(అనంతపురం) ఎంపికయ్యారు. జనరల్ సెక్రటరీగా డాక్టర్ సీహెచ్.రావు(శ్రీకాకుళం), జాయింట్ సెక్రటరీలుగా కె.ఎం.హరికుమార్(శ్రీకాకుళం), సి.శ్రీనివాసరావు(విశాఖపట్నం), ఎన్.వి.రెడ్డి(ప్రకాశం), జి.మధు(అనంతపురం), బొడ్డు సుబ్బారావు(ప్రకాశం), తిరుపతిరెడ్డి, ఎం.ఎ.అజీమ్(ఒంగోలు), అల్లు నగేష్(శ్రీకాకుళం) నియమితులు కాగా, కోశాధికారిగా వై.శివప్రసాద్(విజయవాడ)ను నియమించారు. చీఫ్ పాట్రన్‌గా ఆర్.వీరమణి, హానరరీ చైర్మన్‌గా డాక్టర్ కె.సుబ్బారెడ్డిలను నియమించారు. వీరితో పాటు మరో 25 మందిని అడ్వయిజరీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు.
'ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం'
Published Sun, Jun 12 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM
Advertisement
Advertisement