చార్జీల పెంపుతో సామాన్యులపై భారం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం రూ.8వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడి తే అవినీతి, అక్రమాలు, అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా మారుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పటి మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ మనది ధనిక రాష్ట్రం అని, ఆంధ్రా పాలకులు దోచుకుపోతున్నారని ఆరోపణలు చేశారని, ఇప్పుడు జరుగుతున్నదేమిటో మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బస్సు, కరెంటు చార్జీల పెంపుతో సామాన్య, మధ్యతర గతి ప్రజల ఆర్థిక పరిస్థితిపై పెనుభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
మీడియూ సాక్షిగా చెరువుల వద్ద చర్చకు సిద్ధం
మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల మరమ్మతుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఆయా చెరువుల వద్ద నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చెరువుల వద్ద మీడియూ సాక్షిగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క సవాల్ విసిరారు. మిషన్ మొదటి విడత జరిగిన ప్రస్తుతం రెండవ విడత పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిపుణులతో చెరువుల వద్దకు వస్తే తాము జరిగిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్పీకర్ మధుసూదనాచారి ఆ పదవీకి మచ్చ తెస్తున్నారని జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. బాగిర్తిపేట చెరువు టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా జిల్లాకు మంజూరైన 243ట్రాక్టర్లు టీఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకే ఇచ్చారని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్‌నాయక్, మార్గం సారంగం పాల్గొన్నారు. నాయకులు మార్క విజయకుమార్, తాళ్లపల్లి జయపాల్, ఎండీ రహీం, మార్గం సారంగం, శ్రీరాముల సురేష్, సంతోష్‌నాయక్ పాల్గొన్నారు.