సినీఫక్కీలో హత్య.. ఆపై 'మిస్సింగ్' డ్రామా! | woman's mudder in the line of cinema style | Sakshi
Sakshi News home page

సినీఫక్కీలో హత్య.. ఆపై 'మిస్సింగ్' డ్రామా!

Published Thu, Oct 8 2015 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

సినీఫక్కీలో హత్య.. ఆపై 'మిస్సింగ్' డ్రామా!

సినీఫక్కీలో హత్య.. ఆపై 'మిస్సింగ్' డ్రామా!

విజయవాడ: కృష్ణాజిల్లా నాగాయలంకలో సినిమా తరహాలో దారుణం చోటుచేసుకుంది. వివాహితను భర్త, అత్తమామలే హతమార్చి.. ఆపై కనిపించడంలేదని డ్రామాకు తెరతీశారు. స్వయంగా తామే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. నాగాయలంకలోని బర్రంకులలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

 

కెమెరామ్యాన్ అయిన వంశీ భార్య వరలక్ష్మి మూడు నెలలుగా కనిపించడం లేదు. ఆమె ఎవరితోనో లేచిపోయిందంటూ అత్తామామలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ బిడ్డ కనిపించకపోవడంతో అనుమానించిన వరలక్ష్మి తల్లిదండ్రులు మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. దీంతో అసలు డొంకంతా కదిలింది. భర్త, అత్తామామలే కలిసి వరలక్ష్మిని హతమార్చి, ఓ కాల్వ వద్ద పాతిపెట్టారని, పోలీసులకు అనుమానం వస్తుందేమోనన్న భయంతో ఆ శవాన్ని తర్వాత మరోచోటకు తరలించారని దర్యాప్తులో వెలుగుచూసింది. ప్రస్తుతం మృతదేహాన్ని దాచిపెట్టారని భావిస్తున్న ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement