విద్యుత్‌ తీగ మీదపడి మహిళ మృతి | women died with electricity shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగ మీదపడి మహిళ మృతి

Sep 28 2016 12:28 AM | Updated on Sep 28 2018 3:41 PM

విద్యుత్‌ స్థంభానికి ఉన్న వైరు తెగి మీద పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మండలంలోని ఏకేతండాలో మంగళవారం సాయంత్రం జరిగింది. తండావాసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మూనావత్‌ సారమ్మ(40) వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది.

ఏకేతండా(రాయపర్తి) : విద్యుత్‌ స్థంభానికి ఉన్న వైరు తెగి మీద పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మండలంలోని ఏకేతండాలో మంగళవారం సాయంత్రం జరిగింది. తండావాసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మూనావత్‌ సారమ్మ(40) వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటి ఎదుట వంట చేస్తుండగా ఇంటి ముందు విద్యుత్‌ స్థంభానికి ఉన్న 11కేవీ విద్యుత్‌ వైరు తెగి మీదపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గతంలో తీగ ద్వారా మంటలు చెలరేగేవని ఈ విషయమై విద్యుత్‌ అధికారులకు చెప్పినప్పటికీ  పట్టించుకోలేదని తండావాసులు ఆరోపించారు. విద్యుత్‌ అధికారులపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. మృతురాలికి భర్త పుచ్చానాయక్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు భర్త పుచ్చానాయక్‌ తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement