చాకిరీ బండెడు.. వేతనం గోరంత
నెల్లూరు(సెంట్రల్) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం చివర వరకు ప్రయత్నించి నిరాశ చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంకా అలక వీడలేదు. గత కొన్ని రోజుల నుంచి తనకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబును కోరుతూ వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. ఎంత ప్రయత్నించినా చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ నెలకొనగా, అటు తెలంగాణలో మాత్రం అంగన్‌వా డీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించింది.
జిల్లాలో 3774 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో 3774 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో సుమారు పది వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. 50 వేల వరకు గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం పొందుతున్నారు. సుమారు లక్షమంది చిన్నారులకు ప్రీస్కూలు చదువుతో పాటు పోషకాహారం అందజేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామానికి సంబంధించిన వివిధ సామాజిక కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర పోసిస్తున్నారు. వీటితోపాటు 20 రకాల రికార్డులు నిర్వహిస్తున్నారు.
రోజులో 12 గంటలకుపైగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం వీరిచేత వెట్టిచాకిరి చేయించి అరకొరగా మాత్రం వేతనం ఇస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం రూ.18 వేలు ఇవ్వాలని, అంగన్‌వాడీల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన పోషకాహా రం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రేపటి సమాజానికి దిక్సూ చీలుగా ఎదగవలసిన నేటి చిన్నారుల పోషణపై ప్రభుత్వం చిన్నచూపు చూపటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే మాతా సంరక్షణపై ప్రభుత్వం శ్రద్ధచూపడం లేదనే విమర్శలున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తల పేరును మార్చి అంగన్‌వాడీ టీచర్‌గా గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.7 వేల వేతనాన్ని రూ.10,500కు పెంచింది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం కూడా రూ.6 వేలకు పెంచింది. సీనియారిటీనిబట్టి ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించింది. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో నాణ్యమైన సన్నరకం బియ్యం ద్వారా మధ్యాహ్న భోజ నాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నాణ్యమైన పోషకాహారం సరఫరాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మాతాశిశు సంరక్షణ ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించి ఆమేరకు ఆచరణలో పెట్టింది. అయితే మన రాష్ట్రంలో దుబారా ఖర్చుతో కోట్లాది రూపాయలు మింగేస్తున్న నేతలు ఈ వ్యవహారంపై దృష్టిపెట్టడం లేదు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా మా గోడు పట్టించుకోవాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ విధానమే అమలు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీలకు ప్రాధాన్యం ఇచ్చింది. అంగన్‌వాడీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు వేతనం కూడా పెంచింది. నాణ్యమైన పోషకాహారం అందించే చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీల్లో సీనియారి టీనిబట్టి సూపర్‌వైజర్లుగా ప్రమోషన్లుకు అవకాశం కల్పించింది. అదేవిధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి. ప్రభుత్వం అమలుచేయకపోతే వీటి సాధన కోసం పోరాటం చేస్తాం.
కాకు వెంకటయ్య, సీపీఎం నాయకుడు