తప్పుల కొలత!
- ఇదీ పోలీస్ ఎంపిక ప్రక్రియ తీరు
- కొలతల పేరుతో అభ్యర్థులకు గుండెకోత
- వందలాది మంది పోలీస్ కొలువులకు దూరం
- 500 మందికి అన్యాయం జరిగినట్టుగా ఆరోపణలు
- చట్టబద్ధత లేని స్కేల్ ఉపయోగిస్తున్నారంటున్న అభ్యర్థులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్ష ప్రక్రియలో మరో కోణం బయటికొచ్చింది. తప్పుడు మెజర్‌మెంటుతో తమకు అన్యాయం చేస్తున్నారని ఎంపిక ప్రక్రియలో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులు వాపోతున్నారు. ఎత్తు, ఛాతీ, చుట్టుకొలతల విషయంలో పోలీసుల స్కేల్ తప్పుగా ఉందంటూ వారంతా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తూనికలు కొలతల అధికారులు కొలతల మెజర్‌మెంట్ స్కేల్ తెచ్చినప్పటికీ మళ్లీ పోలీసుల మెజర్‌మెంట్‌తోనే కొలతలతో అన్యాయం జరిగిందని, ఇది తమ జీవి తాల్ని దెబ్బతీసిందని అభ్యర్థులు వాపోతున్నారు.
పక్కాగా లేని కొలతలతో పరేషాన్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పోలీసు శాఖ లో భారీ ఖాళీలు ఏర్పడటంతో లక్షలాది మంది యు వత ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకొని పరీక్షల్లో అర్హత సాధించారు. కాని ఈవెంట్స్‌లో పోలీస్ అధికారులు తప్పుల తడకగా కొలతలు కొలిచి వందలాది మంది అర్హులైన అభ్యర్థులను పక్కన పెట్టేశారు. 6వ జోన్ లో సుమారు 10 వేల పోలీస్ కానిస్టేబుల్, 539 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేష¯ŒS జారీ చేసింది.
వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొందరు అటు ఎస్‌ఐగా, ఇటు కా నిస్టేబుల్‌గానూ ప్రాథమిక అర్హత పరీక్షల్లో అర్హత సాధించారు. వీరికి 20 రోజులుగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పోలీస్ గ్రౌండ్‌లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ముందుగా ఎస్‌ఐ పోస్టులకు పూర్తయ్యా యి. కానిస్టేబుల్ పోస్టులకు ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి మెజర్‌మెంటుతో సంపూర్ణ విశ్వాçÜంతో బరిలోకి దిగిన అభ్యర్థులు ఊహించని విధంగా ఎత్తు, ఛాతీ చుట్టుకొలతల పరీక్షల్లో డిస్‌క్వాలిఫై అవుతున్నారు.
నిబంధన ప్రకారం తూనికలు –కొలతల శాఖ అధికారులు సూచించిన మెజర్‌మెం ట్ స్కేల్ ఆధారంగా ఎత్తు కొలవాల్సి ఉండగా పోలీ సులు రూపొందించిన స్కేల్‌తో కొలవటం వలన కనీసం 2 సెంటీమీటర్ల ఎత్తులో తేడా వస్తుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒకటి–రెండు అంగుళాల ఎత్తు తక్కువ ఉందనే కారణంతో దాదాపు 250 మందిని రిజెక్టు చేశారు. ఈ మెజర్‌మెంట్ స్కేల్‌కు చట్టబద్దత లేదని అభ్యర్థులు అంటున్నారు.
ఇదేం విడ్డూరం?
ఎస్‌ఐ ఎంపిక పరీక్షల్లో ఎత్తు, ఛాతీల్లో అర్హత సాధిం చిన అభ్యర్థులు కానిస్టేబుళ్ల ఈవెంట్స్‌కు సైతం వ చ్చారు. ఎస్‌ఐగా క్వాలిఫై అయిన వారిని కానిస్టేబుల్ అర్హత పరీక్షల్లో నిరాకరించడం వివాదాలకు తావి స్తోంది. దీంతో 256 మంది అభ్యర్థులు పోలీసు కొలతలు తప్పుగా ఉన్నాయంటూ ఒక్కో అభ్యర్థి రూ. 500 ఛలానా చెల్లించి అప్పీల్ చేసుకున్నారు.
తూని కలు కొలతలశాఖ, వైద్యశాఖ, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి తిరిగి ఈనెల 25న మళ్లీ 256 మందికి కొలతలు నిర్వహించారు. ఇందులో 80 మంది వర కు అర్హత సాధించినట్లు అధికారులు సర్టిఫై చేశారు. అయినా పోలీసుల మెజర్‌మెంట్ స్కేల్ తప్పుగా ఉం దని, అందువల్లే అర్హత కోల్పోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు.
తూనికలు కొలతల మెజర్‌మెంట్ స్కేల్ తెచ్చినప్పటికీ మళ్లీ పోలీసుల మెజర్‌మెంట్‌తోనే కొలతలు తీసుకుంటుండటంతో అన్యాయం జరుగుతోందని వారంటున్నారు. ఎత్తు, ఛాతీ విషయంలో మెజర్‌మెంట్ స్కేల్ అంతా ఒక్కటే ఉంటుందా? లేక పోలీసులది వేరేగా ఉంటుందా? అనేది పోలీసులే చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏళ్ల తరబడి శిక్షణ పొంది తీరా తప్పుడు కొలతలతో తమకు అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్నారు.
త్రిసభ్య కమిటీ సమక్షంలో కొలతలు తీశాం
అభ్యర్థుల ఎత్తు, ఛాతీ, చుట్టుకొలత లెక్క కట్టడానికి తూనికలు–కొలతల శాఖ ఇన్ స్పెక్టర్ సర్టిఫై చేసిన మెజర్‌మెంట్ స్కేల్‌నే ఉపయోగించాం. రూ.500 చలానా కట్టి ఛాలెంజ్ చేసిన అభ్యర్థుల కోసం ముగ్గురు సభ్యుల కమిటీ వేశాం. ఈ కమిటీలో జిల్లా ఎస్పీగా నేను, తూనికలు–కొలతల శాఖ ఇన్ స్పెక్టర్, ప్రభుత్వ వైద్యుడు ఉన్నారు.
అందరి సమక్షంలోనే కొలతలు చేశాం. సవాల్ చేసిన 250 మందిలో 36 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో లెక్క తప్పటానికి అవకాశం లేనే లేదు. తల ఎంత వరకు దించాలి?, ఎంత ఎత్తాలో స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఇలా చేయడంలో ఏ కాస్త తేడా వచ్చినా కొన్ని సెంటిమీటర్లు ఎక్కువగా వస్తాయి. అదే కొలమానం కాదు కదా.! ఏ అభ్యర్థికీ అన్యాయం జరగకుండా ప్రామాణికమైన కొలతలు ఉపయోగించాం.– ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి