రైలు ఢీకొని యువకుడు మృతి
Published Wed, Oct 26 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
కల్లూరు (రూరల్): రైలు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు నగరంలోని బుధవారపేట కనకదుర్గమ్మ దేవాలయం పక్కనే నివాసం ఉంటున్న భట్టి ధన్‌రాజ్ సింగ్, తారాబాయి దంపతలకు ఆరుగురు సంతానం. నాలుగో సంతానం భట్టి యువరాజ్ సింగ్ (25)కు మతిస్థితిమితం సరిగా లేదు. సిల్వర్, ప్లాస్టిక్ సామానులు అమ్ముకుంటూ కుటుంబ సభ్యులు జీవనం సాగించేవారు. మానసిక పరిస్థితి సరిగా లేని యువరాజ్ సింగ్ మంగళవారం ఉదయం 10గంటల నుంచి కనిపించకుండాపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులంతా నగరంలో గాలించినా కనిపించలేదు. చివరకు బుధవారం కర్నూలు నగర శివారులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ ఎదురుగా ఉన్న గోశాల వెనుక రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకొని రైల్వే ఎస్‌ఐ జగన్, బంధువులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆదివారం పుట్టిన రోజును జరుపుకుని ఇంతలోనే శాశ్వతంగా వెళ్లిపోయావా అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. మృతదేహానికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement