మహానేతపై చెరగని అభిమానం | YSR fans pinda pradanam for YSR soul in peace | Sakshi
Sakshi News home page

మహానేతపై చెరగని అభిమానం

Published Mon, Aug 22 2016 9:11 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

మహానేతపై చెరగని అభిమానం - Sakshi

మహానేతపై చెరగని అభిమానం

తాడేపల్లిరూరల్‌ (పెదకాకాని): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తాడేపల్లి మండలం పాతూరు గ్రామస్తులు సర్పంచి మేరి వేణు ఆధ్వర్యంలో సోమవారం పాతూరు పుష్కరఘాట్‌లో ఆయనకు  పిండప్రదానం చేశారు. ముందుగా వైఎస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్చకుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పిండప్రదానం చేశారు.

ఈ సందర్భంగా రైతుసంఘం నాయకుడు వజ్రాల నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీలు చేసిన ఘనత  వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పిండప్రదాన కార్యక్రమం చేసినట్టు చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి  చంద్రబాబు రాజధాని పేరుతో భూములు లాక్కుని రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పుష్కరఘాట్‌లకు పసుపు రంగులు వేయడం, పార్టీ బ్యానర్లు పెట్టి భోజనాలు పెట్టడం తదితరాలతో పుష్కరాలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి, గ్రామపార్టీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి, ఎస్సీసెల్‌ కన్వీనర్‌ మరియబాబు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణగోపాలస్వామిరెడ్డి, నాయకులు కత్తిక రాఘవరావు, పాటిబండ్ల కృష్ణమూర్తి, పాతూరి రాజు, రవిచంద్ర, నల్లపు సుదర్శనం, రెడ్డిబత్తుల రాజారెడ్డి, ప్రతాపరెడ్డి, వైఎస్సార్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement