
మునికోటి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండ
తిరుపతి : ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న మునికోటి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా నిలిచింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మునికోటి కుటుంబాన్ని ఆ పార్టీ ఆర్థికంగా ఆదుకుంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి నారాయణస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిలు ఆర్థిక సాయం అందజేశారు.
మునికోటి కుటుంబసభ్యులకు రూ. 3 లక్షలు, తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నశేషాద్రికి రూ.50వేల నగదు అందజేశారు. మునికోటి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఒక అన్నగా వైఎస్ జగన్... తమను ఆదుకుంటున్నారని... ఆర్థికంగా అండగా నిలిచారని మునికోటి భార్య సంతోషం వ్యక్తం చేశారు.