ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేష¯ŒS మూడు జిల్లా ల కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం స్థానిక లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో నిర్వహించారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేష¯ŒS మూడు జిల్లా ల కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం స్థానిక లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబుâýæపతి హాజరయ్యారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.
ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని వెన్నపూస గోపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్య క్షులు అశోక్‌కుమార్‌రెడ్డి, గౌరవాధ్యక్షులు వెంకటేశులు, ప్రధానకార్యదర్శి ఎ.రాధాకృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిధర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పుల్లారెడ్డి, కార్యదర్శి పుల్లయ్య, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనాథరెడ్డితో పాటు జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత వెన్నపూస రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.