‘కూతురుతో సెల్ఫీ’ | selfie with doughter | Sakshi
Sakshi News home page

‘కూతురుతో సెల్ఫీ’

Published Wed, Jul 22 2015 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

‘కూతురుతో సెల్ఫీ’

‘కూతురుతో సెల్ఫీ’

సందర్భం

ఇప్పుడున్నది ‘సెల్ఫీ’ల ప్ర పంచం. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తు లు తగ్గిపోతున్న తరుణం. తక్కువ బడ్జెట్ నుంచి ఐఫోన్ వరకు అందరి దగ్గరా ఏదో ఒక స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్లు చేతికొచ్చిన తరువాత సెల్ఫీలు ఎక్కువ కావడమే కాదు, అది వెర్రితలలు కూడా వేస్తోంది. ‘సెల్ఫీ’ కొత్తగా ఉనికిలోకి వచ్చిన పదం. ఆక్స్‌ఫర్డ్ డిక్ష నరీ (2013) ప్రకారం - ఒక వ్యక్తి తనకు తానుగా తీసు కున్న ఛాయాచిత్రం. స్మార్ట్ ఫోన్‌తో తీసుకొని సోషల్ మీడియాలో ప్రవేశపెట్టినది. తనకు తానుగా ఒక వ్యక్తి తీసుకున్న ఫొటోని సెల్ఫీ అంటున్నాం. అయితే ఆ చిత్రంలో ఆ వ్యక్తితో పాటూ ఇంకా ఎవరైనా లేదా ఏదైనా  కూడా ఉండవచ్చు.

కెమెరాలు మాత్రమే ఉన్న కాలంలో కూడా స్వీయ చిత్రాలను తీసుకోవడం ఉండేది. వాటిని స్వీయ చిత్రా లనేవారేగానీ, సెల్ఫీలనలేదు. అప్పుడు సోషల్ మీడి యా లేదు. అర నిమిషం వ్యవధిలో క్లిక్ అయ్యేలా కెమె రాను రెడీ చేసి, దాని ముందు నిలబడి ఫొటోలు దిగే వాళ్లు. కానీ అవి సెల్ఫీల్లా ప్రాచుర్యం పొందలేదు. అమె రికాలోని ఫిలడెల్ఫియాకి చెందిన ఓ యువ ఛాయా చిత్రకారుడు శార్నిలిన్ 1839లో మొదటిసారిగా స్వీయ చిత్రాన్ని తీసుకున్నాడని ‘పబ్లిక్ డొమెన్ రివ్యూ’ పత్రిక పేర్కొంది. అదే మొదటి సెల్ఫీ అంటున్నారు.  కానీ అది కెమెరాతో, చేత్తో క్లిక్ చేయకుండానే తీసింది. కాబట్టి దాన్ని సెల్ఫీగా పరిగణించలేం. స్మార్ట్ ఫోన్లతో మన చేయి ఎంతదూరం ఉంచగలమో అంత దూరం ఉంచి స్వయం చిత్రాలను తీసుకుంటేనే ‘సెల్ఫీ’.


‘కూతుళ్లతోనే సెల్ఫీలు దిగండి!’ అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదంతో సెల్ఫీ అనే ఈ సరికొత్త పద ప్రయోగం గ్రామగ్రామానికి తెలిసిపోయింది. హర్యానా రాష్ట్రంలో మగవాళ్లకన్నా స్త్రీల సంఖ్య తక్కువ. రోజు రోజుకీ ఆ సంఖ్య తగ్గిపోతోంది. ఆ రాష్ట్రంలో ప్రతి 1,000 మంది మగవాళ్లకు 834 మంది మాత్రమే ఆడవా ళ్లున్నారు. ఇటీవలి ఓ నివేదిక ప్రకారం 2040 నాటికి 20 నుంచి 49 ఏళ్లలోపు స్త్రీలు, మగవారి కంటే 2.3 కోట్లు తక్కువగా ఉంటారని అంచనా. అప్పటి పరిస్థితి అదైతే, ఇప్పుడు రోజూ 1,300 మంది ఆడపిల్లలు మాయమైపో తున్నారు. ఇదిలాగే కొనసాగితే దేశంలో మగవాళ్ల సంఖ్య పెరిగిపోయి ఆడవాళ్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.

హర్యానాలోని పరిస్థితిని గమనించి, ఆ రాష్ట్రంలోని బాజీపూర్ గ్రామ సర్పంచ్ సునీల్ గొగ్లానీ ‘కూతురుతో సెల్ఫీ’ అన్న ప్రచారాన్ని ప్రారంభించారు. దాన్నందుకుని ప్రధాని మోదీ నినాదాన్నే ఇచ్చారు. దాంతో ఆ ప్రచారం ఊపందుకుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుర్లతో ‘సెల్ఫీ’లు ట్వీట్ చేయ డం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ దగ్గర నుంచి ఫ్యాషన్ డిజైనర్ కెన్నెత్ కౌల్ దాకా కూతు ళ్ల్లతో ఫొటోలు దిగి, ట్వీట్‌లు చేసేశారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అంతా ఈ ప్రచారంలో పాలు పంచుకుంటున్నవారే. పైసా ఖర్చు లేకుండా రాజకీయ నాయకులు ఈ ప్రకటనతో ప్రచారం పొందుతున్నారు.


‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారం వల్ల ప్రజలకి కూతుళ్ల పట్ల కొంత అవగాహన ఏర్పడవచ్చు. కానీ ఈ ప్రచా రంతో స్త్రీల సమస్యలు ఏమైనా తగ్గుముఖం పడ తాయా? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం కష్టమే. కూతు రుతో సెల్ఫీలు సోషల్ మీడియాలో షికార్లు చేయడం వల్ల కూతుళ్లకు ఒకింత సంతోషం, గర్వం లభించవచ్చు. కానీ వారి సమస్యలకు, ముఖ్యంగా భ్రూణ హత్యలకు అది ముగింపు పలుకుతుందని అనుకోలేం. కనీసం తగ్గుముఖం పట్టిస్తుందని కూడా అనుకోలేం. మహిళా సాధికారత  కొంతవరకు పరిష్కారం కావచ్చు. అందు వల్ల కనీసం భ్రూణ హత్యలు కొంత వరకు తగ్గే అవకా శమైనా ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా పని చేస్తు న్నట్టు అనిపించడం లేదు. ఏది ఏమైనా సెల్ఫీలు బాగా ప్రాచుర్యం పొందడమే కాదు, కొందరిలో ఈ పిచ్చి బాగా ముదురుతోంది. కొంత మంది కుర్రకారు చని పోయిన తమ తాతలతో, నానమ్మలతో సెల్ఫీలు దిగి వాటిని ట్వీట్ చేసే దాకా వెళ్లిపోయారు. కొన్ని దేశాల్లో ఈ సెల్ఫీలు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి.

భ్రూణ హత్యలను తగ్గించే లక్ష్యంతో మొదలైన ఈ ‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారానికి... ఈషాన్ జాఫ్రీ కూతు రు నిష్రీన్ జాఫ్రీ గుండె కలుక్కుమనేలాంటి బాధాకర మైన ముగింపునిచ్చింది. ఈషాన్ జాఫ్రీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరవ లోక్‌సభకు ఎన్నికైన  పార్లమెంట్ సభ్యుడు. 2002 నాటి  గుజరాత్ అల్లర్లలో ‘గుల్‌బర్గ్’ సామూహిక హత్యాకాండకు బలైపోయిన వ్యక్తి. తన ఇంట్లో ఆశ్రయం పొందిన ముస్లిం స్త్రీలను, పిల్లలను మతోన్మాద అల్లరి మూకల నుంచి కాపాడే ప్రయత్నంలో బలైపోయిన వ్యక్తి. అల్లరిమూకలకు నచ్చజెప్పి పంపడానికి వారితో మాట్లాడటం వల్లే ఆ గుంపు ఆయన్ను హత్య చేసిందని స్పెషల్ దర్యాప్తు సంస్థ తేల్చింది.

మోదీ ‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారాన్ని చూసి ఇషాన్ జాఫ్రీ కూతురు నిష్రీన్ జాఫ్రీ తండ్రితో ఉన్న తన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది సెల్ఫీ అవునో కాదో తెలియదు. ఆమె దానికి ‘‘కూతురుతో సెల్ఫీ: ఇది అతన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుం ది’’ అనే వ్యాఖ్యను జోడించింది. నిష్రీన్ ఆ ‘అతను’ ఎవ రో చెప్పలేదు. కానీ అందరికీ అది అర్థమవుతూనే ఉంది. నిజానిజాలు తేటతెల్లం కాలేదు కానీ.. ‘కూతురుతో సెల్ఫీ’ సెల్ఫ్‌గోల్‌గా మారింది. హర్యానాలో మొదలైన ‘కూతురుతో సెల్ఫీ’ గుజరాత్‌తో ముగిసిందనుకోవచ్చు. ఆ కథ ముగిసినా ముగియకపోయినా... సెల్ఫీలు ఇప్పు డే అంతర్థానం కావు. అయినా ఫర్వాలేదు, వెర్రితలలు వేయకపోతే అదే సంతోషం.
 

 - మంగారి రాజేందర్
 (వ్యాసకర్త న్యాయ నిపుణులు) 94404 83001

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement