బయాలజీ | biology | Sakshi
Sakshi News home page

బయాలజీ

Published Tue, Jan 14 2014 3:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సూర సత్యనారాయణ - Sakshi

సూర సత్యనారాయణ

హెచ్‌ఐవీ-ఎయిడ్స్
 1.    హెచ్‌ఐవీ సోకిన పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే విధానం?
     ఇతర సాధారణ పిల్లల్లానే
 2.    సరైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యానికి ఏది అవసరం?
     చక్కని ఆలోచన
 3.    వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడటానికి కావాల్సిన నైపుణ్యం?
     సంభాషణా నైపుణ్యం


 4.    హెచ్‌ఐవీ తన రూపాన్ని మార్చుకోవడానికి సహాయపడే ఎంజైమ్?
     రివర్‌‌స ట్రాన్‌‌సస్క్రిప్టేస్
 
 పోషణ
 5.    ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి?
     4 కిలో కేలరీలు
 6.    ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి ఎంత?
     9.45 కిలో కేలరీలు
 7.    రోజూ సుమారుగా ఎంత కాల్షియం అవసరం?
     400-500 మి.గ్రా.
 8.    ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి?
     ఎనీమియా
 9.    అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి?
     సామాన్య గాయిటర్
 10.    సెల్యులోజ్ ఒక?
     కార్బొహైడ్రేట్
 11.    ఏ ఖనిజ లవణం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి?
     ఫ్లోరిన్
 12.    ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్న తాగునీటి ద్వారా వచ్చే వ్యాధి?
     ఫ్లోరోసిస్
 13.    పాలలోని చక్కెరను ఏమంటారు?
     లాక్టోజ్
 14.    చెరకులోని చక్కెరను ఏమంటారు?
     సుక్రోజ్
 15.    జంతువుల్లోని స్టార్‌‌చని ఏమంటారు?
     గ్లైకోజన్
 16.    కణంలో కొత్త అణువులు రూపొందడానికి ఎలాంటి శక్తి అవసరం?
     ఏటీపీ
 17.    పెద్దవారికి కాకుండా పిల్లలకు మాత్రమే అవసరమైన ఆవశ్యక ఎమైనో ఆమ్లం?
     హిస్టిడీన్
 18.    ఎమైనో ఆమ్లాలు దేనిలో ఉంటాయి?
     {పోటీన్లు
 19.    ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ఖనిజ లవణం?
     కాల్షియం
 20.    హిమోగ్లోబిన్‌లో ముఖ్యమైన మూలకం?
     ఐరన్
 21.    దంతాల్లో పగుళ్లు ఏర్పడకుండా కాపాడే ఖనిజ లవణం?
     ఫ్లోరిన్
 22.    శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఏ కణాల్లో నిలువ చెందుతుంది?
     అడిపోస్ కణజాలం
 23.    శరీరం బరువులో 20 శాతం కంటే ఎక్కువ కొవ్వు ఉంటే, ఆ వ్యక్తికి వచ్చే వ్యాధిని ఏమంటారు?
     స్థూలకాయత్వం
 24.    ఇటీవల స్థూలకాయత్వం గురించి చేసిన పరిశోధనల్లో  తేలిన విషయం ?
     వంశ పారంపర్యం కావచ్చు
 25.    క్యాషియోర్కర్ వ్యాధి ఏ పోషకాహార లోపం వల్ల కలుగుతుంది?
     {పోటీన్లు
 26.    అతిగా తినడం, శక్తిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది?
     స్థూలకాయత్వం
 27.    కేలరీల పోషకాహార లోపాన్ని ఏమంటారు?
     శక్తి పోషకాహార లోపం
 28.    సర్.హెచ్.జి. హాప్‌కిన్‌‌స పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థ్థం దేనిలో ఉందని కనుగొన్నారు?
     పాలు
 29.    విటమిన్ల పుట్టుపుర్వోత్తరాలు ఏ శతాబ్దానికి చెందినవి?
     18వ
 30.    థయమిన్ (విటమిన్ బి1) లోపం వల్ల కలిగే వ్యాధి?
     బెరిబెరి
 31. రైబోఫ్లెవిన్ (విటమిన్ బి2) లోపం వల్ల కలిగే వ్యాధి?
     గ్లాసైటిస్
 32.    విటమిన్ బి3 లోపం వల్ల కలిగే వ్యాధి?
     పెల్లాగ్రా
 33.    పాంటోథినిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం?
     కాళ్లు
 34.    విటమిన్ ‘సి’ లోపం వల్ల కలిగే వ్యాధి?
     స్కర్వీ
 35.    రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది?
     విటమిన్ ‘కె’
 36.    వేడిచేసినప్పుడు అతి త్వరగా నశించిపోయే విటమిన్ ఏది?
     విటమిన్ ‘సి’
 37.    గాయాలు మానటంలో, విరిగిన ఎముకలు అతుక్కోవడంలో తోడ్పడే విటమిన్?
     విటమిన్ ‘సి’
 38.    జీరఫ్‌థాల్మియా వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది?
     కన్ను
 39.    జామకాయల్లో లభించే విటమిన్?
     విటమిన్ ‘సి’
 40.    బొప్పాయి పండులో అధికంగా ఉండే విటమిన్?
     విటమిన్ ‘ఎ’
 41.    ‘విటమిన్’ పేరును మొదట ప్రవేశ పెట్టినవారు?
     ఫంక్
 42.    శరీరంలోని కొలెస్టిరాల్‌ను సూర్యరశ్మి  ఏ విధంగా మారుస్తుంది?
     విటమిన్ ‘డి’
 43.    పురుషుల్లో వ్యంధ్యత్వం రాకుండా చేసే విటమిన్?
     విటమిన్ ‘ఇ’
 44.    ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి  కలుగుతుంది?
     విటమిన్ ‘ఎ’
 45.    విటమిన్ ‘ఎ’ రసాయనిక నామం ఏది?
     రెటినాల్
 46.    విటమిన్ ‘సి’ రసాయనిక నామం?
     ఆస్కారిబిక్ ఆమ్లం
 47.    విటమిన్ ‘డి’ రసాయనిక నామం?
     కాల్సిఫెరాల్
 48.    విటమిన్ ‘ఇ’ రసాయనిక నామం?
     టోకోఫెరాల్
 49.    నిమ్మ, ఉసిరి కాయల్లో లభించే విటమిన్?
     విటమిన్ ‘సి’
 50.    విటమిన్ ‘ఎ’ శరీరంలో ఎంతకాలం నిల్వ ఉంటుంది?
     6 నుంచి 9 నెలలు
 51.    విటమిన్ ‘డి’ లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి?
     రికెట్స్
 52.    కొల్లాజన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ ?
     విటమిన్ ‘సి’
 53.    హానికర రక్త హీనత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
     సయానో కోబాలమిన్
 54.    క్షయ, గవద బిళ్లలు, కోరింత దగ్గు వ్యాధుల సంక్రమణ జరిగే పద్ధతి?
     లాలాజల తుంపర్ల ద్వారా
 55.    {బిటన్‌లో రోగ కారక క్రిములతో కలుషితమైన మేతను పశువులు తినడం వల్ల వచ్చిన వ్యాధి?
     మేడ్ -కౌ
 56.    అతి నిద్రాజాడ్యం (ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్‌నెస్)లో పొదిగే కాలం?
     20 నుంచి 30  ఏళ్లు
 57.    రోగ కారక జీవులను వ్యాప్తి చెందించే జంతువులను ఏమంటారు?
     వాహకాలు
 58.    ప్లేగు వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాకు వాహకాలు?
     ఎలుకలు
 59.     ఎల్లో జ్వరం కలిగించే వాటికి వాహకాలు?
     కోతులు
 60.    హెపటైటిస్ లాంటి వైరస్ జ్వరానికి వాహకాలు ఏవి?
     మానవులు
 61.    మలేరియా జ్వరానికి వాహకాలు?
     ఆడ ఎనాఫిలస్ దోమ
 62.    శోషరస నాళాలు, శోషరస గ్రంథుల వాపు వల్ల వచ్చే వ్యాధి?
     బోధవ్యాధి
 63.    ఏ వైరస్ ద్వారా గవద బిళ్లల వ్యాధి  కలుగుతుంది?
     మిక్సోవైరస్ పరొటైడిస్
 64.    తట్టు లేదా అమ్మవారుకి  మరో పేరు?
     రూబెల్ల
 65.    తట్టు లేదా అమ్మవారు (మీజిల్స్) ఏ వైరస్ ద్వారా కలుగుతుంది?
     పారామిక్సో వైరస్
 66.    ఏ వైరస్ ద్వారా మెదడు వాపు వ్యాధి  కలుగుతుంది?
     ఆర్బోవైరస్
 67.    మెదడు వాపు వ్యాధి వైరస్‌లకు ప్రధాన అతిథేయి ఏది?
     పందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement