బయాలజీ | Biology | Sakshi
Sakshi News home page

బయాలజీ

Published Wed, Jan 8 2014 11:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సూర సత్యనారాయణ - Sakshi

సూర సత్యనారాయణ

1.    జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి సహాయపడే జీవక్రియ?
     {పత్యుత్పత్తి
 2.    కార్బొహైడ్రేట్లలోని శక్తిని విడుదల చేసే క్రియ?
     శ్వాసక్రియ
 3.    కంటికి కనిపించే కాంతి తరంగదైర్ఘ్యం ఎంత?
     400-700 ఝ
 4.    పిండిపదార్థం ఉన్నట్లు తెలిపే పరీక్షలో ఉపయోగించే పరీక్షకం ఏది?
     అయోడిన్
 5.    మొక్కల్లో వాయువుల మార్పిడి, నీటి ఆవిరిని నియంత్రించే నిర్మాణాలు?
     పత్ర రంధ్రాలు
 6.    హరిత రేణువుల్లో థైలకాయిడ్ దొంతరలను ఏమంటారు?
 గ్రానా
 7.    ఆకుపచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను ఎప్పుడు పరీక్షిస్తారు?
     మొక్కను 2-3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత
 8.    కిరణజన్య సంయోగక్రియలో కర్బన స్థాపనపై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త?
     మెల్విన్ కాల్విన్
 9.    మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకు?
     ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి
 10.    గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ సుమారు ఎంత శాతం ఉంటుంది?
     0.03శాతం
 11.    గరిష్ఠ శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత?
     30నిఇ - 45నిఇ
 12.    గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం ఎంత?
     2 ఏటీపీ అణువులు
 13.    కణంలోని  ఏ భాగంలో కణశ్వాసక్రియ  జరుగుతుంది?
     మైటోకాండ్రియా
 14.    మైటోకాండ్రియాలో ఉండే లోపలి ముడతలను ఏమంటారు?
 క్రిస్టే
 15.    సిట్రిక్ ఆమ్లంలో జరిగే వరుస చర్యలను అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞుడు?
     సర్‌హోన్‌‌స క్రెబ్స్
 16.    గ్లూకోజ్ ఆక్సీకరణలో మొదటిదశను ఏమంటారు?
     గ్లైకాలసిస్
 17.    బొద్దింకలో (కీటకాల్లో) శ్వాసేంద్రియాలు?
     వాయునాళాలు
 18.    అమీబా లాంటి ఏకకణజీవుల్లో శ్వాసక్రియ పద్ధతి?
     విసరణ
 19.    వానపాములో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది?
     చర్మం
 20.    ఉపరికుల  ఉండే జీవికి ఉదాహరణ?
     అస్థిచేప
 21.    అప్పుడే జన్మించిన శిశువుల్లో నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత?
     32 సార్లు
 22.    కంఠబిలంపై మూతలా పనిచేసే నిర్మాణం?
     కొండనాలుక / ఉపజిహ్వక
 23.    మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాలు ఏ  ఆకారంలో ఉంటాయి?
     ఇ ఆకారం
 24.    రక్తంలోని హిమోగ్లోబిన్ చేరవేసేది?
     ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్
 25.    ఎర్రరక్త కణాలు లేని జీవికి ఉదాహరణ?
     వానపాము
 26.    నీలిరంగు రక్తం వేటిలో ఉంటుంది?
     పీత, నత్త
 27.    తెలుపు రంగు రక్తం వేటిలో ఉంటుంది?
     బొద్దింక (కీటకాలు)
 28.    అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక ఏ జీవిలో ఉంటుంది?
     తొండ (సరీసృపాలు)
 29.    13 గదుల హృదయం ఏ జీవిలో ఉంటుంది?
     బొద్దింక
 30.    మూడు గదుల హృదయం దేనిలో ఉంటుంది?
     కప్ప
 31.    ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉండే కవాటం?
     మిట్రల్ కవాటం (అగ్రద్వయ కవాటం)
 32.    మానవునిలో సాధారణ రక్తపీడనం ఎంత?
     120/80
 33.    దేనిలో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది?
     హృదయ ధమని
 
 34.    బీపీని కొలిచే పరికరం ఏది?
     స్పిగ్మోమానోమీటర్
 35.    మానవ శరీరంలో అతిపెద్ద ధమని?
     మహాధమని
 36.    మానవ శరీరంలో ద్రవరూప కణజాలం?
     రక్తం
 37.    ఎర్రరక్తకణాల ఉత్పత్తిని ఏమంటారు?
     ఎరిత్రోపాయిసిస్
 38.    ఎర్రరక్తకణాల జీవితకాలం ఎంత?
     120 రోజులు
 39.    ఆరోగ్యంగా ఉన్న మానవునిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తకణాల మధ్య ఉండాల్సిన నిష్పత్తి?    (వీఆర్‌వో-2012)
     6000:1     
 40.    రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం?
     0.85-0.9 శాతం
 41.    రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది?
     హిపారిన్
 42.    తెల్ల రక్త కణాల జీవిత కాలం?
     12-13 రోజులు
 43.    రక్త కణాలన్నింటిలో అతిచిన్నది?
     లింఫోసైటు
 44.    ఎయిడ్‌‌స వల్ల నశించే రక్త కణాలు?
     లింఫోసైట్లు
 45.    శరీర సూక్ష్మరక్షకభటులు అని వేటిని అంటారు?
     న్యూట్రోఫిల్స్
 46.    ఎర్ర రక్తకణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు?
     ప్లీహం
 47.    రక్త వర్గాలను కనిపెట్టినవారు?
     కారల్‌లాండ్ స్టీనర్
 48.    విశ్వదాతలు అని  ఏ రక్తవర్గం కలిగిన వారినంటారు?
     ’O’ రక్తవర్గం
 49.    విశ్వ గ్రహీతలని ఏ రక్తవర్గం కలిగిన వారినంటారు?
     ’AB’ రక్తవర్గం
 50.    అత్యవసర పరిస్థితుల్లో రక్తవర్గం తెలియనప్పుడు రక్త గ్రహీతకు ఏ వర్గాన్ని ఇవ్వవచ్చు?
     ’O’ రక్తవర్గం
 
 నియంత్రణ - సమన్వయం
 51.    మొక్కల్లో పెరుగుదల పదార్థాలుంటాయని మొదటిసారి ప్రతిపాదించిన వారు?
     ఛార్లెస్ డార్విన్
 52.    ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం?
     2, 4 - డీ
 53.    విత్తనాలు లేని ఫలాలను ఏమంటారు?
     అనిషేక ఫలాలు
 54.    మొక్కల్లో కణ విభజనను ప్రోత్సహించే హార్మోన్?
     సైటోకైనిన్
 55.    అగ్రాధిక్యత అంటే ఏమిటి?
     కొనమొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడం
 56.    పత్రాలు, ఫలాలు రాలడాన్ని ప్రేరేపించే హార్మోన్?
     అబ్‌సిసిక్ ఆమ్లం (ABA)
 57.    మొక్కల్లో నీటిని నష్టపోకుండా సహకరించే హార్మోన్ ఏది?
     అబ్‌సిసిక్ ఆమ్లం (ABA)
 58.    ఫలాలు ముందుగా పక్వం వచ్చేందుకు సహకరించే హార్మోన్?
     ఇథిలీన్
 59.    శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథి?
     పీయూష గ్రంథి
 60.    మిశ్రమ గ్రంథి అని  దేనిని అంటారు?
     క్లోమం
 61.    నాడీ మండలానికి, అంతస్రావీ గ్రంథి వ్యవస్థకు వారధిలా పనిచేసే గ్రంథి?
     పీయూష గ్రంథి
 62.    అవయవాలను సమన్వయ పరిచే రసాయన పదార్థాలను ఏమంటారు?
     హార్మోన్‌లు
 63.    వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఏది?
     అవటు గ్రంథి
 64.    ఏ హార్మోన్ లోపం వల్ల డయాబిటిస్ మిల్లిటస్ (చక్కెరవ్యాధి) కలుగుతుంది?
     ఇన్సులిన్
 65.    పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్?
     {పోజెస్టిరాన్
 66.    ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం?
     థైరాక్సిన్
 67.    మానసిక ఉద్రేకాలను కలగజేసే హార్మోన్?
     ఎడ్రినలిన్
 68.    శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ?
     నాడీ వ్యవస్థ
 69.    నిస్సల్ కణికలు  ఉన్న కణాలు ఏవి?
     నాడీ కణదేహం
 70.    పోలియో వంటి వ్యాధుల్లో వైరస్ వల్ల నశించే కణాలు ఏవి?
     చాలక నాడీకణాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement