బయాలజీ | biology | Sakshi
Sakshi News home page

బయాలజీ

Published Sat, Jan 11 2014 10:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బయాలజీ - Sakshi

బయాలజీ

నియంత్రణ సమన్వయం
 1.    శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు ఏవి?
     నాడులు
 2.    జ్ఞానాంగాల నుంచి మెదడు లేదా వెన్ను పాముకు వార్తలను తీసుకెళ్లే నాడులు?
     అభివాహి నాడులు
 3.    నాడీకణం ఉద్దీపనాలకు గురైనప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి?
      55 మిల్లీ వోల్టులు
 4.    మెదడుకి రక్షణ ఇచ్చే పెట్టె లాంటి నిర్మాణం?
      కపాలం
 5.    మెదడును కప్పి ఉండే బయటి పొర?
     వరాశిక
 6.    మెదడును కప్పి ఉండే మధ్యపొర?
     లౌతికళ
 7.    మెదడును కప్పి ఉండే లోపలి పొర?
     మృద్వి
 8.    మస్తిష్కం ఉపరితల వైశాల్యాన్ని వృద్ధి చేసేవి?
     గైరీ
 9.    మెదడులో శరీరం, వివిధ చర్యలను నియంత్రించే ఉన్నత కేంద్రం ఏది?
     మస్తిష్కం
 10.    మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య?
     31
 11.    మానవునిలో కపాలనాడుల జతల సంఖ్య?
     12
 12.    మానవునిలో పరిధీయ నాడుల జతల సంఖ్య?
     43
 13.    హృదయ స్పందనలు ఏ కపాలనాడీ ఆధీనంలో ఉంటాయి?
     వేగస్‌నాడీ
 14.    అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో దేని ఆధీనంలో ఉంటాయి?
     వెన్నుపాము
 15.    శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు ఎంత?
     2 శాతం
 16.    కవిత్వం మొదలైన వాటిని ఆనందించే లక్షణం ఉన్న  శరీర భాగం ఏది?
     మెదడు
 17.    1990 నుంచి 2000 శతాబ్దాన్ని దేని యుగంగా పరిగణిస్తారు?
     మెదడు యుగం
 18.    నిబంధన సహిత ప్రతిచర్యలపై ప్రయోగాలు చేసినవారు?
      ఇవాన్ పావ్‌లోవ్
 19.     జాతీయ గీతాన్ని వినగానే మనం శ్రద్ధతో లేచి నిలబడడం ఏ చర్య?
     నిబంధన సహిత ప్రతిచర్య
 20.    సమస్యలను విశ్లేషించడంలో తోడ్పడే మెదడు భాగం?
     మస్తిష్కం
 
  ప్రత్యుత్పత్తి
 21.    చేమంతి మొక్క సాధారణంగా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
     పిలకమొక్కలు
 22.    ఈస్ట్‌లో సాధారణంగా జరిగే అలైంగికోత్పత్తి విధానం?
     కోరకీభవనం
 23.    అలంకరణ, ఉద్యానవన మొక్కల అభివృద్ధికి ఉపయోగించే ప్రత్యుత్పత్తి విధానం?
     శాఖీయోత్పత్తి
 24.    కరివేప, వేప మొక్కల్లో శాఖీయోత్పత్తికి తోడ్పడేవి?
     వేరుమొగ్గలు
 25.    ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇచ్చే శక్తిని ఏమంటారు?
     టోటిపొటెన్సీ
 26.    రణపాలాకు మీద ఉండే మొగ్గలను ఏమంటారు?
     పత్రోపరిస్థిత కోరకాలు
 27.    వర్థన యానంలో వేటిని ఉపయోగించి ఏకస్థితిక మొక్కలు తయారు చేస్తారు?
     పరాగ రేణువులు
 28.    ఫలదళాలు దేనిలో ఉంటాయి?
     అండకోశం
 29.    లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు ఏవి?
     అండకోశం, కేసరావళి
 30. పురుష సంయోగబీజం దేనితో సంయోగం చెందితే అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది?
     ద్వితీయ కేంద్రకం
 31. ఫలదీకరణం తర్వాత కూడా ఉపయోగపడే పుష్పభాగాలు ఏవి?
     అండాలు
 32. బాగా ఏర్పడిన పిండంలో వేరుభాగాన్ని సూచించేది?
     {పథమమూలం
 33. పేరమీషియం ఏ పద్ధతి ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
     సంయోగం
 34. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు?
     కప్ప, చేప
 35. అంతర ఫలదీకరణం జరిపే జీవులు?
     సరీసృపాలు, క్షీరదాలు
 36.     ఒకే జీవిలో పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉండే స్థితిని ఏమంటారు?
     ఉభయ లైంగికత
 37. వానపాములో ముష్కాలు ఉండే ఖండితాలు ఏవి?
     10, 11
 38. వానపాములో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది?
     గుడ్లకోశం
 39. కప్ప మిల్ట్‌లో ఉండేవి?
     శుక్రకణాలు
 40. కప్ప స్పాన్‌లో ఉండేవి?
     అండకణాలు
 41. అండకణంలోకి చొచ్చుకు పోయేందుకు ఉపయోగపడే శుక్రకణ నిర్మాణం ?
     ఏక్రోజోమ్
 42. పేరమీషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండే చర్య?
     {పత్యుత్పత్తి
 43. లైంగిక ద్విరూపకత చూపే జీవి?
     వానపాము
 44. ఈగలో ఫలదీకరణం చెందిన అండాల విడుదలలో సహాయపడే నిర్మాణం?
     అండశబిక
 45. కప్పలోని ఏంప్లక్సరీ మెత్తలు దేనికి తోడ్పడతాయి?
     సంపర్కం
 46. ఏ నిర్మాణంలో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి?
     {స్తీ బీజ కోశం
 47. స్త్రీలలో ఒక్కోసారి విడుదలయ్యే అండాల సంఖ్య?
     ఒకటి
 48. తల్లి గర్భాశయ కుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణం ఏది?
     జరాయువు
 49. ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోన్?
     టెస్టోస్టిరాన్
 50. గర్భదారణ తర్వాత మూడో నెల నుంచి పిండాన్ని ఏమంటారు?
     {భూణం
 51. పగిలిన పుటికను ఏమంటారు?
     కార్పస్ లూటియం
 52. భారత ప్రభుత్వం బాల్య వివాహాల  నిరోధ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది?
     1978  
 53. శుక్రకణాలు చలించడానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసేది?
     మైటోకాండ్రియా
 54. గర్భదారణ  తర్వాత జరాయువు  ఎప్పుడు ఏర్పడుతుంది?
     12వ వారానికి
 55. గర్భదారణ తర్వాత పిండం లైంగికత్వాన్ని ఎప్పుడు నిర్ధారించొచ్చు?
     6వ వారానికి
 
 హెచ్‌ఐవీ - ఎయిడ్‌‌స
 56.    హెచ్‌ఐవీ పరిమాణమెంత?
     120 నానోమీటర్లు  
 57. ఎయిడ్‌‌సను కలిగించే జీవి?
     వైరస్
 58. హెచ్‌ఐవీ ఉనికిని తెలిపే పరీక్ష?
     రక్త పరీక్ష
 59. 2003 వరకు ఎయిడ్‌‌స వ్యాధి వల్ల చని పోయిన వ్యక్తుల సంఖ్య?
     3 మిలియన్లు
 60. హెచ్‌ఐవీ ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లు ఏవి?
     రివర్‌‌స ట్రాన్‌‌స స్క్రిప్టేస్, ఇంటిగ్రేస్, ప్రోటియేజ్
 61.  భారతదేశంలో ఏ  నగరంలో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిని గుర్తించారు?
     చెన్నై
 62. ఎయిడ్‌‌స వ్యాధి వల్ల తగ్గే శరీర బరువు శాతం ఎంత?
     10 శాతం
 63.    హెచ్‌ఐవీ అధిక గాఢత ఏ ద్రవంలో ఉంటుంది?
     రక్తం  
 64. హెచ్‌ఐవీని నిర్ధారించడానికి చేసే పరీక్షలు?
     ఎలీసా, వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్, పీసీఆర్ పరీక్ష
 65. భారతదేశంలో తొలిసారి  ఎయిడ్స్ కేసును  ఎప్పుడు గుర్తించారు?
     1986

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement