sura satyanarayana
-
జీవన విధానాలు
జీవశాస్త్రం సిలబస్‌లోని మొత్తం ఆరు పాఠ్యాంశాలను ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. మొదటి చాప్టర్ ‘జీవన విధానాలు’ నుంచి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 23 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ చాప్టర్ నుంచి ఒక 1 మార్కు ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు, రెండు 4 మార్కుల ప్రశ్నలు, ఒక 5 మార్కుల ప్రశ్న, పది బీ మార్కుల ప్రశ్నలు అడుగుతారు. కచ్చితంగా ఒక పటం (5 మార్కుల ప్రశ్న) అడుగుతారు. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ అధ్యాయాల్లో ముఖ్యంగా ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలను బాగా అధ్యయనం చేయాలి. ప్రయోగాల నుంచి ఏటా ఒక 4 మార్కుల ప్రశ్న అడుగుతున్నారు. ప్రయోగాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు. 1. కిరణజన్య సంయోగక్రియకు కార్బన్‌డైఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తారు? 2. కిరణజన్య సంయోగక్రియలో ఆమ్లజని విడుదలవుతుందని నిరూపించండి? 3. కిరణజన్య సంయోగక్రియకు కాంతి లేదా వెలుతురు అవసరమని ఎలా నిరూపిస్తారు? 4. శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని నిరూపించండి? కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ అధ్యాయాల్లో భేదాలకు సంబంధించిన ప్రశ్నలను బాగా అధ్యయనం చేయాలి. భేదాలను ఒకదానితో మరొకటి సరిపోల్చు కొని అధ్యయనం చేస్తే బాగా గుర్తుం చుకోవచ్చు. భేదాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు: 1. ఆక్సీకరణం, క్షయకరణంల మధ్య భేదాలు రాయండి? 2. మండటం (లేదా) దహనక్రియ, శ్వాస క్రియ మధ్య భేదాలు? 3. కాంతి భాస్వీకరణం,ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్కు మధ్య భేదం ఏమిటి? 4. అవాయు, వాయుసహిత శ్వాసక్రియల మధ్య ఉన్న భేదాలను తెల్పండి? 5. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలను రాయండి? ఈ చాప్టర్లో వచ్చే నిర్వచనాలను బాగా అధ్యయనం చేసినట్లయితే అవి ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఉపయుక్తమవుతాయి. ముఖ్యమైన నిర్వచనాలు : 1) జీవక్రియ, 2) కిరణజన్య సంయోగక్రియ, 3) చర్యాకేంద్రం, 4) శ్వాసక్రియ, 5) శ్వాసక్రియాధారాలు, 6) అత్యంత అనుకూల ఉష్ణోగ్రత, 7) కిణ్వనం, 8) జల శ్వాసక్రియ, 9) చర్మ శ్వాసక్రియ, 10) అంగిలి. పటం చక్కగా గీసి, భాగాలు స్పష్టంగా గుర్తించాలి. పటానికి 3 మార్కులు, భాగాలకు 2 మార్కులు ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ నుంచి ముఖ్యమైన పటాలు. 1. ఆకు అడ్డుకోత పటం గీసి భాగాలను గుర్తించండి? 2. మైటోకాండ్రియా పటం గీసి భాగాలను గుర్తించండి? 3. మానవుని ఊపిరితిత్తుల పటం గీసి భాగాలను గుర్తించండి? కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ అధ్యాయాల్లోని అంశాలను, నిత్య జీవిత విషయాలకు అన్వయించుకుని చదివితే సులభంగా అర్థం చేసుకోవచ్చు. 1. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియ వల్ల సమస్త జీవకోటికి ఆక్సిజన్ లభించడం వల్ల మానవ మనుగడ సాధ్యం అవుతోంది. ఈ ప్రక్రియ వల్ల కలప, వంటచెరకు, బొగ్గు, పెట్రోల్, ఔషధాలు మొదలైన అనేక విలువైన పదార్థాలు కూడా లభ్యమవుతాయి. 2. కిణ్వనం చర్యను ఆల్కహాలు ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. మన నిత్య జీవితంలో ఇడ్లీ, దోసెల పిండి పులియడం కూడా కిణ్వన ప్రక్రియే. ముఖ్యమైన ప్రశ్నలు 1. జీవక్రియ అంటే ఏమిటి? జ. జీవి మనుగడకు, దాని వంశాభివృద్ధికి అవసరమైన క్రియలను జీవక్రియ అంటారు. ఉదా: పోషణ, శ్వాసక్రియ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి. 2. కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి? జ. ఆకుపచ్చ మొక్కల్లో ఉండే హరితరేణువులు కార్బన్‌డైఆక్సైడ్, నీటిని ఉపయోగించి కార్బోహైడ్రేట్స్‌ను తయారుచేసే కాంతి రసాయన చర్యను కిరణజన్య సంయోగక్రియ అంటారు. 3. చర్యా కేంద్రం అంటే ఏమిటి? జ. హరితరేణువులో థైలకాయిడ్ త్వచంపై నిర్మితమై ఉండే పత్రహరితం దాని అనుబంధ వర్ణద్రవ్య అణువులు చర్యాకేంద్రాలుగా నిర్మితమై ఉంటాయి. ఈ కేంద్రాలు కాంతిచర్యవ్యవస్థ ఐ, కాంతిచర్య వ్యవస్థ ఐఐ అని రెండు రకాలు. 4. శ్వాసక్రియను నిర్వచించండి? జ. ఆహార పదార్థాలైన గ్లూకోజ్, కొవ్వు ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా మారి శక్తిని విడుదల చేసే క్రియను శ్వాసక్రియ అంటారు. 5. శ్వాసక్రియాధారాలు అంటే ఏమిటి? జ. శ్వాసక్రియలో ఆక్సీకరణ చెంది శక్తి విడుదల చేసే పదార్థాలను శ్వాసక్రియాధారాలు అంటారు. ఉదా: కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు -
బయాలజీ
నియంత్రణ సమన్వయం 1. శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు ఏవి? నాడులు 2. జ్ఞానాంగాల నుంచి మెదడు లేదా వెన్ను పాముకు వార్తలను తీసుకెళ్లే నాడులు? అభివాహి నాడులు 3. నాడీకణం ఉద్దీపనాలకు గురైనప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి? 55 మిల్లీ వోల్టులు 4. మెదడుకి రక్షణ ఇచ్చే పెట్టె లాంటి నిర్మాణం? కపాలం 5. మెదడును కప్పి ఉండే బయటి పొర? వరాశిక 6. మెదడును కప్పి ఉండే మధ్యపొర? లౌతికళ 7. మెదడును కప్పి ఉండే లోపలి పొర? మృద్వి 8. మస్తిష్కం ఉపరితల వైశాల్యాన్ని వృద్ధి చేసేవి? గైరీ 9. మెదడులో శరీరం, వివిధ చర్యలను నియంత్రించే ఉన్నత కేంద్రం ఏది? మస్తిష్కం 10. మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య? 31 11. మానవునిలో కపాలనాడుల జతల సంఖ్య? 12 12. మానవునిలో పరిధీయ నాడుల జతల సంఖ్య? 43 13. హృదయ స్పందనలు ఏ కపాలనాడీ ఆధీనంలో ఉంటాయి? వేగస్‌నాడీ 14. అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో దేని ఆధీనంలో ఉంటాయి? వెన్నుపాము 15. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు ఎంత? 2 శాతం 16. కవిత్వం మొదలైన వాటిని ఆనందించే లక్షణం ఉన్న శరీర భాగం ఏది? మెదడు 17. 1990 నుంచి 2000 శతాబ్దాన్ని దేని యుగంగా పరిగణిస్తారు? మెదడు యుగం 18. నిబంధన సహిత ప్రతిచర్యలపై ప్రయోగాలు చేసినవారు? ఇవాన్ పావ్లోవ్ 19. జాతీయ గీతాన్ని వినగానే మనం శ్రద్ధతో లేచి నిలబడడం ఏ చర్య? నిబంధన సహిత ప్రతిచర్య 20. సమస్యలను విశ్లేషించడంలో తోడ్పడే మెదడు భాగం? మస్తిష్కం ప్రత్యుత్పత్తి 21. చేమంతి మొక్క సాధారణంగా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? పిలకమొక్కలు 22. ఈస్ట్‌లో సాధారణంగా జరిగే అలైంగికోత్పత్తి విధానం? కోరకీభవనం 23. అలంకరణ, ఉద్యానవన మొక్కల అభివృద్ధికి ఉపయోగించే ప్రత్యుత్పత్తి విధానం? శాఖీయోత్పత్తి 24. కరివేప, వేప మొక్కల్లో శాఖీయోత్పత్తికి తోడ్పడేవి? వేరుమొగ్గలు 25. ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇచ్చే శక్తిని ఏమంటారు? టోటిపొటెన్సీ 26. రణపాలాకు మీద ఉండే మొగ్గలను ఏమంటారు? పత్రోపరిస్థిత కోరకాలు 27. వర్థన యానంలో వేటిని ఉపయోగించి ఏకస్థితిక మొక్కలు తయారు చేస్తారు? పరాగ రేణువులు 28. ఫలదళాలు దేనిలో ఉంటాయి? అండకోశం 29. లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు ఏవి? అండకోశం, కేసరావళి 30. పురుష సంయోగబీజం దేనితో సంయోగం చెందితే అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది? ద్వితీయ కేంద్రకం 31. ఫలదీకరణం తర్వాత కూడా ఉపయోగపడే పుష్పభాగాలు ఏవి? అండాలు 32. బాగా ఏర్పడిన పిండంలో వేరుభాగాన్ని సూచించేది? {పథమమూలం 33. పేరమీషియం ఏ పద్ధతి ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది? సంయోగం 34. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు? కప్ప, చేప 35. అంతర ఫలదీకరణం జరిపే జీవులు? సరీసృపాలు, క్షీరదాలు 36. ఒకే జీవిలో పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉండే స్థితిని ఏమంటారు? ఉభయ లైంగికత 37. వానపాములో ముష్కాలు ఉండే ఖండితాలు ఏవి? 10, 11 38. వానపాములో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? గుడ్లకోశం 39. కప్ప మిల్ట్లో ఉండేవి? శుక్రకణాలు 40. కప్ప స్పాన్‌లో ఉండేవి? అండకణాలు 41. అండకణంలోకి చొచ్చుకు పోయేందుకు ఉపయోగపడే శుక్రకణ నిర్మాణం ? ఏక్రోజోమ్ 42. పేరమీషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండే చర్య? {పత్యుత్పత్తి 43. లైంగిక ద్విరూపకత చూపే జీవి? వానపాము 44. ఈగలో ఫలదీకరణం చెందిన అండాల విడుదలలో సహాయపడే నిర్మాణం? అండశబిక 45. కప్పలోని ఏంప్లక్సరీ మెత్తలు దేనికి తోడ్పడతాయి? సంపర్కం 46. ఏ నిర్మాణంలో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి? {స్తీ బీజ కోశం 47. స్త్రీలలో ఒక్కోసారి విడుదలయ్యే అండాల సంఖ్య? ఒకటి 48. తల్లి గర్భాశయ కుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణం ఏది? జరాయువు 49. ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోన్? టెస్టోస్టిరాన్ 50. గర్భదారణ తర్వాత మూడో నెల నుంచి పిండాన్ని ఏమంటారు? {భూణం 51. పగిలిన పుటికను ఏమంటారు? కార్పస్ లూటియం 52. భారత ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1978 53. శుక్రకణాలు చలించడానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసేది? మైటోకాండ్రియా 54. గర్భదారణ తర్వాత జరాయువు ఎప్పుడు ఏర్పడుతుంది? 12వ వారానికి 55. గర్భదారణ తర్వాత పిండం లైంగికత్వాన్ని ఎప్పుడు నిర్ధారించొచ్చు? 6వ వారానికి హెచ్ఐవీ - ఎయిడ్స 56. హెచ్ఐవీ పరిమాణమెంత? 120 నానోమీటర్లు 57. ఎయిడ్సను కలిగించే జీవి? వైరస్ 58. హెచ్ఐవీ ఉనికిని తెలిపే పరీక్ష? రక్త పరీక్ష 59. 2003 వరకు ఎయిడ్స వ్యాధి వల్ల చని పోయిన వ్యక్తుల సంఖ్య? 3 మిలియన్లు 60. హెచ్ఐవీ ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లు ఏవి? రివర్స ట్రాన్స స్క్రిప్టేస్, ఇంటిగ్రేస్, ప్రోటియేజ్ 61. భారతదేశంలో ఏ నగరంలో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిని గుర్తించారు? చెన్నై 62. ఎయిడ్స వ్యాధి వల్ల తగ్గే శరీర బరువు శాతం ఎంత? 10 శాతం 63. హెచ్ఐవీ అధిక గాఢత ఏ ద్రవంలో ఉంటుంది? రక్తం 64. హెచ్ఐవీని నిర్ధారించడానికి చేసే పరీక్షలు? ఎలీసా, వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్, పీసీఆర్ పరీక్ష 65. భారతదేశంలో తొలిసారి ఎయిడ్స్ కేసును ఎప్పుడు గుర్తించారు? 1986 -
బయాలజీ
1. జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి సహాయపడే జీవక్రియ? {పత్యుత్పత్తి 2. కార్బొహైడ్రేట్లలోని శక్తిని విడుదల చేసే క్రియ? శ్వాసక్రియ 3. కంటికి కనిపించే కాంతి తరంగదైర్ఘ్యం ఎంత? 400-700 ఝ 4. పిండిపదార్థం ఉన్నట్లు తెలిపే పరీక్షలో ఉపయోగించే పరీక్షకం ఏది? అయోడిన్ 5. మొక్కల్లో వాయువుల మార్పిడి, నీటి ఆవిరిని నియంత్రించే నిర్మాణాలు? పత్ర రంధ్రాలు 6. హరిత రేణువుల్లో థైలకాయిడ్ దొంతరలను ఏమంటారు? గ్రానా 7. ఆకుపచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను ఎప్పుడు పరీక్షిస్తారు? మొక్కను 2-3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత 8. కిరణజన్య సంయోగక్రియలో కర్బన స్థాపనపై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త? మెల్విన్ కాల్విన్ 9. మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకు? ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి 10. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ సుమారు ఎంత శాతం ఉంటుంది? 0.03శాతం 11. గరిష్ఠ శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత? 30నిఇ - 45నిఇ 12. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం ఎంత? 2 ఏటీపీ అణువులు 13. కణంలోని ఏ భాగంలో కణశ్వాసక్రియ జరుగుతుంది? మైటోకాండ్రియా 14. మైటోకాండ్రియాలో ఉండే లోపలి ముడతలను ఏమంటారు? క్రిస్టే 15. సిట్రిక్ ఆమ్లంలో జరిగే వరుస చర్యలను అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞుడు? సర్హోన్స క్రెబ్స్ 16. గ్లూకోజ్ ఆక్సీకరణలో మొదటిదశను ఏమంటారు? గ్లైకాలసిస్ 17. బొద్దింకలో (కీటకాల్లో) శ్వాసేంద్రియాలు? వాయునాళాలు 18. అమీబా లాంటి ఏకకణజీవుల్లో శ్వాసక్రియ పద్ధతి? విసరణ 19. వానపాములో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? చర్మం 20. ఉపరికుల ఉండే జీవికి ఉదాహరణ? అస్థిచేప 21. అప్పుడే జన్మించిన శిశువుల్లో నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత? 32 సార్లు 22. కంఠబిలంపై మూతలా పనిచేసే నిర్మాణం? కొండనాలుక / ఉపజిహ్వక 23. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఇ ఆకారం 24. రక్తంలోని హిమోగ్లోబిన్ చేరవేసేది? ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ 25. ఎర్రరక్త కణాలు లేని జీవికి ఉదాహరణ? వానపాము 26. నీలిరంగు రక్తం వేటిలో ఉంటుంది? పీత, నత్త 27. తెలుపు రంగు రక్తం వేటిలో ఉంటుంది? బొద్దింక (కీటకాలు) 28. అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక ఏ జీవిలో ఉంటుంది? తొండ (సరీసృపాలు) 29. 13 గదుల హృదయం ఏ జీవిలో ఉంటుంది? బొద్దింక 30. మూడు గదుల హృదయం దేనిలో ఉంటుంది? కప్ప 31. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉండే కవాటం? మిట్రల్ కవాటం (అగ్రద్వయ కవాటం) 32. మానవునిలో సాధారణ రక్తపీడనం ఎంత? 120/80 33. దేనిలో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది? హృదయ ధమని 34. బీపీని కొలిచే పరికరం ఏది? స్పిగ్మోమానోమీటర్ 35. మానవ శరీరంలో అతిపెద్ద ధమని? మహాధమని 36. మానవ శరీరంలో ద్రవరూప కణజాలం? రక్తం 37. ఎర్రరక్తకణాల ఉత్పత్తిని ఏమంటారు? ఎరిత్రోపాయిసిస్ 38. ఎర్రరక్తకణాల జీవితకాలం ఎంత? 120 రోజులు 39. ఆరోగ్యంగా ఉన్న మానవునిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తకణాల మధ్య ఉండాల్సిన నిష్పత్తి? (వీఆర్వో-2012) 6000:1 40. రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం? 0.85-0.9 శాతం 41. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది? హిపారిన్ 42. తెల్ల రక్త కణాల జీవిత కాలం? 12-13 రోజులు 43. రక్త కణాలన్నింటిలో అతిచిన్నది? లింఫోసైటు 44. ఎయిడ్స వల్ల నశించే రక్త కణాలు? లింఫోసైట్లు 45. శరీర సూక్ష్మరక్షకభటులు అని వేటిని అంటారు? న్యూట్రోఫిల్స్ 46. ఎర్ర రక్తకణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు? ప్లీహం 47. రక్త వర్గాలను కనిపెట్టినవారు? కారల్లాండ్ స్టీనర్ 48. విశ్వదాతలు అని ఏ రక్తవర్గం కలిగిన వారినంటారు? ’O’ రక్తవర్గం 49. విశ్వ గ్రహీతలని ఏ రక్తవర్గం కలిగిన వారినంటారు? ’AB’ రక్తవర్గం 50. అత్యవసర పరిస్థితుల్లో రక్తవర్గం తెలియనప్పుడు రక్త గ్రహీతకు ఏ వర్గాన్ని ఇవ్వవచ్చు? ’O’ రక్తవర్గం నియంత్రణ - సమన్వయం 51. మొక్కల్లో పెరుగుదల పదార్థాలుంటాయని మొదటిసారి ప్రతిపాదించిన వారు? ఛార్లెస్ డార్విన్ 52. ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం? 2, 4 - డీ 53. విత్తనాలు లేని ఫలాలను ఏమంటారు? అనిషేక ఫలాలు 54. మొక్కల్లో కణ విభజనను ప్రోత్సహించే హార్మోన్? సైటోకైనిన్ 55. అగ్రాధిక్యత అంటే ఏమిటి? కొనమొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడం 56. పత్రాలు, ఫలాలు రాలడాన్ని ప్రేరేపించే హార్మోన్? అబ్సిసిక్ ఆమ్లం (ABA) 57. మొక్కల్లో నీటిని నష్టపోకుండా సహకరించే హార్మోన్ ఏది? అబ్సిసిక్ ఆమ్లం (ABA) 58. ఫలాలు ముందుగా పక్వం వచ్చేందుకు సహకరించే హార్మోన్? ఇథిలీన్ 59. శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథి? పీయూష గ్రంథి 60. మిశ్రమ గ్రంథి అని దేనిని అంటారు? క్లోమం 61. నాడీ మండలానికి, అంతస్రావీ గ్రంథి వ్యవస్థకు వారధిలా పనిచేసే గ్రంథి? పీయూష గ్రంథి 62. అవయవాలను సమన్వయ పరిచే రసాయన పదార్థాలను ఏమంటారు? హార్మోన్లు 63. వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఏది? అవటు గ్రంథి 64. ఏ హార్మోన్ లోపం వల్ల డయాబిటిస్ మిల్లిటస్ (చక్కెరవ్యాధి) కలుగుతుంది? ఇన్సులిన్ 65. పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్? {పోజెస్టిరాన్ 66. ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం? థైరాక్సిన్ 67. మానసిక ఉద్రేకాలను కలగజేసే హార్మోన్? ఎడ్రినలిన్ 68. శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ? నాడీ వ్యవస్థ 69. నిస్సల్ కణికలు ఉన్న కణాలు ఏవి? నాడీ కణదేహం 70. పోలియో వంటి వ్యాధుల్లో వైరస్ వల్ల నశించే కణాలు ఏవి? చాలక నాడీకణాలు