ఆన్‌లైన్ ‘పరీక్ష’లో విజయానికి... | Exam Tips of Online exam... | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ ‘పరీక్ష’లో విజయానికి...

Published Tue, Jun 21 2016 11:32 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

ఆన్‌లైన్ ‘పరీక్ష’లో విజయానికి... - Sakshi

ఆన్‌లైన్ ‘పరీక్ష’లో విజయానికి...

ఎగ్జామ్ టిప్స్
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది.. అన్ని విభాగాల మాదిరిగానే చదువు, పోటీ పరీక్షలు కూడా ‘ఆన్‌లైన్’ బాటలో నడుస్తున్నాయి. ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలతో పాటు క్యాట్, గేట్ వంటి ప్రవేశ పరీక్షలూ ఆన్‌లైన్లో జరుగుతున్నాయి. ఆన్‌లైన్ పరీక్షల వల్ల ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మార్గాలు..
 
అభ్యర్థులు మొదట ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. దరఖాస్తు విధానం, పరీక్ష కేంద్రాలు, స్లాట్ బుకింగ్, ఎగ్జామ్ ఇన్‌స్ట్రక్షన్స్, పరీక్ష విధానం తదితరాల గురించి ముందే తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
 
మాక్ టెస్ట్‌లు కీలకం
వీలైనన్ని ఎక్కువ ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల ఆన్‌లైన్ పరీక్షపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్, ఎస్సే... ప్రశ్నలకు ఆన్‌లైన్లో సమాధానాలు ఎలా రాయాలో తెలుస్తుంది. తరచూ ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సెక్షన్ల వారీగా సమయాన్ని నిర్దేశించుకుని, ప్రాక్టీస్ చేయాలి.
 
వేగం, కచ్చితత్వం అవసరం
ప్రాక్టీస్ సమయంలోనే ప్రశ్నను వేగంగా చదివి అర్థం చేసుకుని తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానం గుర్తించేలా సాధన చేయాలి. లేకపోతే ప్రశ్న పెద్దగా, క్లిష్టంగా ఉన్నప్పుడు సమయం వృథా అవ డమే కాక  చివర్లో సమయం సరిపోక ఇబ్బంది పడేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్, డేటా అనాలసిస్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో.. వీలైనంతలో పెన్-పేపర్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయాలి.
 
మార్గదర్శకాలు చదవాలి
పరీక్ష ప్రారంభానికి ముందు తప్పనిసరిగా గైడ్‌లైన్స్ చదవాలి. దీని వల్ల సమయం ఆదా చేయడం, పరీక్ష విధానం, తీసుకోవాల్సిన  జాగ్రత్తలు తెలుస్తాయి. పరీక్ష రాసేటప్పుడు టైం కీలక పాత్ర పోషిస్తుంది. తెలివిగా ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. పేజీ పైభాగంలో కనిపించే కౌంట్‌డౌన్ డిస్‌ప్లే గమనిస్తూ పరీక్ష రాయాలి. దీని వల్ల ఏ సెక్షన్‌కు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు.
 
కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు
* పరీక్ష సమయానికి ముందే పరీక్షహాలుకు చేరుకుని నెట్ కనెక్షన్, కంప్యూటర్‌ను చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యానికి తెలియజేయాలి. వైర్‌లెస్ ఇంటర్నెట్ కంటే కేబుల్ నెట్ కనెక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
* పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి నావిగేషన్ బటన్‌లను (బ్యాక్, హోం, ఫార్వోడ్, రీఫ్రెష్, రీలోడ్) ఉపయోగించకూడదు.
* పేజీ పూర్తిగా లోడ్  అయ్యే వరకు వేచి ఉండాలి. పేజీ పూర్తిగా లోడ్ కాకుండానే పరీక్ష  రాయడం ప్రారంభిస్తే కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉంది.
* ప్రతి ప్రశ్నకు సమాధానం క్లిక్ చేశాక సేవ్ చేయడం మరచిపోవద్దు.
* పరీక్ష రాయడం పూర్తయితే, అన్ని ప్రశ్నలను ఒకసారి చెక్ చేసుకొని, అప్పుడు సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
* సబ్‌మిట్ చే సేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కొంచెం ముందుగానే సబ్‌మిట్ చేయాలి. సబ్‌మిట్ చేశాక కన్ఫర్మేషన్ పాస్‌వర్డ్ వచ్చే వరకు వేచి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్‌వర్డ్ రాకపోతే సబ్‌మిట్ కాలేదని అర్థం. వెంటనే ఇన్విజిలేటర్‌కి తెలియజేసి, సరిగా సబ్‌మిట్ అయ్యేలా చూసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement