భవ్యమైన కెరీర్‌కు... ఏఎంఈ | Higher scales to make royal career with Aircraft Maintenance Engineer | Sakshi
Sakshi News home page

భవ్యమైన కెరీర్‌కు... ఏఎంఈ

Published Sat, Aug 16 2014 12:06 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

భవ్యమైన కెరీర్‌కు... ఏఎంఈ - Sakshi

భవ్యమైన కెరీర్‌కు... ఏఎంఈ

ఒక విమానం గాల్లోకి ఎగరాలంటే లెసైన్స్‌డ్ మెయింటనెన్స్ ఇంజనీర్ అనుమతి తప్పనిసరి. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా తనిఖీ చేసుకున్న తర్వాతే ఈ అనుమతి లభిస్తుంది. విమానం క్షేమంగా గమ్యస్థానం చేరుకోవాలంటే అందులో అన్ని యంత్రాలు సక్రమంగా పనిచేయాలి. అది టెక్నికల్‌గా, ఫిజికల్‌గా పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసే నిపుణుడే.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్(ఏఎంఈ). విమాన ప్రయాణం మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుండడంతో మన దేశంలో విమానయాన సంస్థల సంఖ్య పెరుగుతోంది. కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఎంఈలకు డిమాండ్ విసృ్తతమవుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే దేశవిదేశాల్లో భారీ వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి.
 
ప్రారంభం నుంచే మంచి వేతనాలు
 ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్ అనేది మిగిలిన ఇంజనీరింగ్ వృత్తులకంటే భిన్నమైనది. బీఈ/బీటెక్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు కాగా మూడేళ్లలో ఏఎంఈ కోర్సు పూర్తిచేయొచ్చు. ఏఎంఈలకు ప్రభుత్వ, ప్రైవేట్ విమానయాన సంస్థలతోపాటు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రంగంలో ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో చేరితే భారీ వేతనాలు, భత్యాలు అందుకోవచ్చు.
 
స్కిల్స్ అప్‌డేట్ చేసుకోవాలి

 ఏఎంఈగా కష్టపడి పనిచేస్తే  కెరీర్‌లో వేగంగా పైకి ఎదగొచ్చు. ప్రయాణికుల భద్రతతో ముడిపడి ఉన్న రంగం కాబట్టి ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి చిన్న తప్పిదం కూడా భారీ ప్రమాదానికి దారితీస్తుంది. టెక్నికల్ స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. లెసైన్స్‌డ్ ఏఎంఈలకు డీజీసీఏ ప్రతిఏటా పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే లెసైన్స్‌ను పొడిగిస్తారు. లేకపోతే రద్దు చేస్తారు. ఎయిర్‌లైన్స్ సంస్థలు షార్ట్ టర్మ్  ట్రైనింగ్ కోర్సులను నిర్వహిస్తుంటాయి. వీటిద్వారా నైపుణ్యాలను పెంచుకోవాలి.
 
అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించినవారు ఏఎంఈ కోర్సులో చేరేందుకు అర్హులు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆమోదించిన కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. డీజీసీఏతోపాటు కళాశాల నిర్వహించే అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఏఎంఈగా లెసైన్స్ పొందొచ్చు.
 
 వేతనాలు:  ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వేతనం లభిస్తుంది. అనుభవం, పనితీరును బట్టి వేతనం పెరుగుతుంది. సీనియర్లకు నెలకు రూ.లక్షకు పైగానే అందుతుంది. సంస్థను బట్టి వేతనాల్లో వ్యత్యాసాలు ఉంటాయి.
 
 ఏఎంఈ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
 ఒ రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ-సికింద్రాబాద్
 వెబ్‌సైట్: www.rgaviation.com
 ఒ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 వెబ్‌సైట్: http://iiaeit.org/
 ఒ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్
 వెబ్‌సైట్: www.soapalam.org
 ఒ హిందూస్థాన్ ఏరోస్పేస్ అండ్ ఇంజనీరింగ్
 వెబ్‌సైట్: www.haepune.com
 ఒ పవన్‌హన్స్ హెలికాప్టర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
 వెబ్‌సైట్: www.pawanhans.co.in
 
 సవాలుతో కూడుకున్న కెరీర్!
 శ్రీఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్లకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ తదితర సంస్థలు ఏఎంఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నా యి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి కొన్ని సంస్థలు యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుని బీఎస్సీ డిగ్రీలను ప్రదానం చేస్తున్నాయి. అలాగే మరికొన్ని సంస్థలు ఎమ్మెస్సీ ఏవియేషన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్‌లో విద్యార్థి 75శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ కోర్సులు పూర్తి చేయాలంటే కఠోర శ్రమ తప్పనిసరి. కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి డీజీసీఏ పరీక్ష నిర్వహించి లెసైన్‌‌సలు మంజూరు చేస్తుంది. దాంతో ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. ఈ కెరీర్ సవాలుతో కూడుకున్నది. ఎయిర్‌క్రాఫ్ట్ రిపేరింగ్ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించడానికి అవకాశం ఉండదు. సూక్ష్మ పరిజ్ఞానం ఉండాలి. ఓపికతో పనిచేయాల్ణి
 - ప్రొ. వై.బి.సుధీర్ శాస్త్రి,
 హెచ్‌ఓడీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్,

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్
 
 జనరల్ నాలెడ్‌‌జ
 కామన్‌వెల్త్ క్రీడల గురించి తెలుసా?
 కామన్‌వెల్త్ సంస్థలో సభ్యత్వం గల దేశాలు కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొంటాయి. బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలను కామన్‌వెల్త్ దేశాలంటాం. కామన్‌వెల్త్ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్‌లో జరిగాయి. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్ళకోసారి జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లో వీటిని నిర్వహించలేదు. 1930 నుంచి 1950 వరకు వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా పిలిచేవారు. 1954నుంచి 1966 వరకు అంపైర్ అండ్ కామన్‌వెల్త్ గేమ్స్‌గా పేర్కొనేవారు. 1970, 1974లో బ్రిటిష్ కామన్‌వెల్త్ గేమ్స్‌గా వ్యవహరించేవారు. ఈ క్రీడల్లో 71 జట్లు పాల్గొంటాయి. ప్రతి క్రీడలకు హాజరైన జట్లు ఆరు - ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్. ఇప్పటివరకు ఈ పోటీలకు అత్యధిక సార్లు ఆతిథ్యమిచ్చిన దేశాలు ఆస్ట్రేలియా (4), కెనడా (4), న్యూజిలాండ్ (3). అక్లాండ్, ఎడిన్ బరో నగరాలు చెరి రెండుసార్లు నిర్వహించాయి. భారతదేశం ఒకేసారి 2010లో నిర్వహించింది. 2018లో ఆస్ట్రేలియా ఐదోసారి నిర్వహించబోతోంది.              
 -ఎన్.విజయేందర్‌రెడ్డి
 
 ప్రాచీన యుగంలోని ప్రపంచంలో ఏడు వింతలు తెలుసుకోండి
 క్ర.సం.      వింతలు    దేశం
 1.    పిరమిడ్లు    ఈజిప్టు
 2.    వేలాడే ఉద్యానవనాలు    బాబిలోనియా
 3.    డయానా దేవాలయం    రోమ్
 4.    జ్యూస్ విగ్రహం    ఒలంపియా
 5.    మాసులస్ సమాధి    టర్కీ
 6.    ఫారో రాజుల లైట్‌హోస్    అలెగ్జాండ్రియా
 7.    ఖలాస్సస్ విగ్రహం    రోడ్‌‌స
 
   ప్రపంచంలో ప్రముఖ జలపాతాలు తెలుసా?
 జలపాతం    నది    ఎత్తు(మీటర్లలో)    ఉనికి
 ఎంజెల్    కరోని ఉపనది     972    వెనెజుల
             (అతిఎత్తైది)
 టుగెల    టుగెల    919    దక్షిణాఫ్రికా (నటల్)
 కుక్వెనన్    కుక్వెనన్    610    వెనెజుల
 సుథర్ లాండ్    అర్‌థుర్    580    న్యూజిలాండ్
 టక్కకవ్    యెహ ఉపనది    503    {బిటిష్  కొలంబియా
 రిబ్బోన్    యెసెమిటె    491    కాలిఫోర్నియా
 గవర్నయి    గవడిపో    422    నైరుతి ఫ్రాన్‌‌స
 వెట్టిస్‌పాస్    యెర్కెడోల    366    నార్వే
 విండోస్ టీర్‌‌స    మెర్‌‌సడ్ ఉపనది    357    కాలిఫోర్నియా
 నయాగారా    ఈరి, ఒంటారియో    
 -    అమెరికా, కెనడా (అతిపెద్దది)
 
 జాబ్స్ అలర్‌‌ట్స
 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  ఎకనామిస్ట్; అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీతో పాటు పీహెచ్‌డీ
  చీఫ్ ఎకనామిస్ట్; అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీ ఉండాలి. మనీ/ బ్యాంకింగ్/ ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యం.
  చార్టర్డ్ అకౌంటెంట్; అర్హతలు: సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
  చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్; అర్హతలు: ఏదైనా బ్యాంకులో జనరల్ మేనేజర్‌గా రిటైర్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30; వెబ్‌సైట్: www.iob.in
 
 పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ
 పెట్రోనెట్ ఎన్‌ఎన్‌జీ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు: ఏ ప్లాంట్ ఆపరేటర్; ఏ సీనియర్ ఆఫీసర్/ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)
 ఏ మేనేజర్ (మెకానికల్); ఏ టెక్నీషియన్ (మెకానికల్); ఏ సీనియర్ ఆఫీసర్/ ఆఫీసర్ (ఆపరేషన్); ఏ చీఫ్ మేనేజర్ (మెయింటనెన్స్);        ఏ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్); ఏ సీనియర్ ఆఫీసర్/ ఆఫీసర్ (మెకానికల్), అర్హతలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 31; వెబ్‌సైట్: www.petronetlng.com
 
 రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ
 తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ఊ సీనియర్ రీసెర్చ్ ఫెలో: 8; అర్హతలు: కెమికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ సెన్సైస్, మెడికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, వెటర్నరీ సెన్సైస్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
 ఊ టెక్నికల్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్): 2
 అర్హతలు: హెచ్‌ఆర్‌ఎం/ పబ్లిక్ రిలేషన్స్/ ఫైనాన్స్/అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
 ఊ టెక్నికల్ ఆఫీసర్: 6; అర్హతలు: కెమికల్ సెన్సైస్/ బయోటెక్నాలజీ/ బయో మెడికల్ సెన్సైస్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌ల్లో పీజీ ఉండాలి.
 ఊ టెక్నికల్  అసిస్టెట్: 8; అర్హతలు: కెమికల్ సెన్సైస్/ లైఫ్ సెన్సైస్‌లో డిగ్రీ ఉండాలి.
 దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 27
 వెబ్‌సైట్: www.rgcb.res.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement