‘ఐఐటీ–ఖరగ్‌పూర్’లో 121 నాన్ టీచింగ్ పోస్టులు
ఖరగ్‌పూర్(పశ్చిమ బెంగాల్)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఖాళీలతోపాటు గతంలో భర్తీ కాకుండా మిగిలిన (బ్యాక్‌లాగ్) పోస్టులూ ఉన్నాయి.
పోస్టుల వారీ వేకెన్సీ: అసిస్టెంట్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్–1; ఎగ్జిక్యూటివ్–8; జూనియర్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్–4; జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్–16; జూనియర్ ఎగ్జిక్యూటివ్–25; జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్–4; ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్–3; సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–2; మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ/రేడియోలజీ/ఫిజియోథెరపీ)–4; స్టాఫ్ నర్స్–5; అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్–2)–2; జూనియర్ టెక్నీషియన్/లేబొరేటరీ అసిస్టెంట్–36; జూనియర్ అసిస్టెంట్–6; సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్–2; డ్రైవర్(గ్రేడ్–2)–3.
వేతనం: అసిస్టెంట్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్ నుంచి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకు రూ.9,300–34,800+గ్రేడ్‌పే రూ.4,200. మిగిలిన పోస్టులకు రూ.5,200–20,200+గ్రేడ్‌పే రూ.2,000.
విద్యార్హత: ఎగ్జిక్యూటివ్: డిగ్రీ, సంబంధిత కొలువులో 8 ఏళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం; జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/డిగ్రీ/తత్సమానం, సీనియర్ టెక్నీషియన్‌గా 8 ఏళ్ల అనుభవం; జూనియర్ ఎగ్జిక్యూటివ్: డిగ్రీ, సీనియర్ అసిస్టెంట్‌గా 8 ఏళ్ల అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం; స్టాఫ్ నర్స్: ఇంటర్మీడియెట్, జీఎన్‌ఎం, ఏడాది అనుభవం; జూనియర్ టెక్నీషియన్/లేబొరేటరీ అసిస్టెంట్: డిగ్రీ(సైన్స్)/సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా, వైర్‌మ్యాన్ లైసెన్స్/పర్మిట్ ఉండాలి; జూనియర్ అసిస్టెంట్: డిగ్రీ, 40 డబ్ల్యూపీఎం వేగంతో కంప్యూటర్‌పై కంపోజింగ్ (టైపింగ్) చేయగలగాలి.
గరిష్ట వయోపరిమితి: పోస్టును బట్టి 30–45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, అప్లికేషన్ హార్డ్ కాపీని అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులను విడివిడిగా పంపాల్సి ఉంటుంది.
చివరి తేది: ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు, హార్డ్ కాపీ పంపేందుకు: జనవరి 31
వెబ్‌సైట్: iitkgp.ac.in