జేఈఈ మెయిన్-2016లో మెరవాలంటే.. | Intermediate syllabus for students | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్-2016లో మెరవాలంటే..

Published Wed, Nov 25 2015 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

జేఈఈ మెయిన్-2016లో మెరవాలంటే..

జేఈఈ మెయిన్-2016లో మెరవాలంటే..

 ఇంటర్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ
 విద్యార్థులు ఇంటర్మీడియెట్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ నెలాఖరుకు మెయిన్ సిలబస్, ఇంటర్ రెండేళ్ల సిలబస్‌లో ఉన్న ఉమ్మడి అంశాలను పూర్తి చేయాలి. జనవరిలో మెయిన్ సిలబస్‌లో ఉండి, ఇంటర్‌లో లేని అంశాలపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. మార్చి చివరి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత మెయిన్ పరీక్షపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అప్పటికే తాము రాసుకున్న సొంత నోట్స్, షార్ట్ కట్ ఫార్ములాల ఆధారంగా రివిజన్ చేయాలి. ఆ సమయంలో కొత్త అంశాలు (అంటే అప్పటి వరకు చదవని, విస్మరించిన అంశాలు) చదవడం ఏ మాత్రం సరికాదు.
 
 టైం మేనేజ్‌మెంట్
 ఇంటర్మీడియెట్ అకడమిక్ తరగతుల సమయాన్ని మినహాయిస్తే అందుబాటులో ఉండే సమయంలో కనీసం ఆరు నుంచి ఏడు గంటలు మెయిన్, ఇంటర్మీడియెట్ అంశాల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో నోట్స్ రాసుకోవడంతోపాటు  ఫార్ములాలు, సిద్ధాంతాలు ఉండేలా చూసుకోవాలి. ఇది రివిజన్ సమయంలో బాగా ఉపకరిస్తుంది. ఇలా ఇప్పటి నుంచే రోజూ వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగిస్తూ కనీసం 150 మార్కులు లక్ష్యంగా కృషి చేస్తే ‘కటాఫ్ రేంజ్’లో నిలిచే అవకాశాలు మెరుగవుతాయి.
 
 జేఈఈ మెయిన్-2015, 2014
 అధికారిక కటాఫ్ స్కోర్లు
 విభాగం    2015    2014
 కామన్ మెరిట్ లిస్ట్    105    115
 ఓబీసీ    70    74
 ఎస్‌సీ    50    53
 ఎస్‌టీ    44    47
 మెయిన్ ద్వారా సీట్లు భర్తీ చేసే
 ఇన్‌స్టిట్యూట్‌లు - సీట్ల సంఖ్య
 ఇన్‌స్టిట్యూట్‌లు    సంఖ్య    సీట్లు
 ఎన్‌ఐటీలు    31    17,920
 ట్రిపుల్ ఐటీలు    18    2,228
 ఇతర కేంద్ర ప్రభుత్వ
 ఇన్‌స్టిట్యూట్‌లు    18    3,920
 మొత్తం    67    24,068
 గమనిక: ఎన్‌ఐటీల్లోని సీట్లలో 50 శాతం సీట్లను సదరు నిట్ ఏర్పాటై ఉన్న రాష్ట్ర విద్యార్థులకు హోం స్టేట్ కోటా కింద కేటాయిస్తారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విద్యార్థులకు నిట్ వరంగల్‌లో 370 (మొత్తం సీట్లు 740); నిట్ తాడేపల్లిగూడెంలో 240 (మొత్తం సీట్లు 480) సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు హోం స్టేట్ కోటాలో రిజర్వేషన్ ఉంటుంది.
 
 కాన్సెప్ట్స్, అప్లికేషన్స్, ప్రాక్టీస్
 మెయిన్‌లో విజయానికి మూడు ముఖ్యమైన సూత్రాలు అనుసరించాలి. అవి కాన్సెప్ట్ ఆధారిత అధ్యయనం, అప్లికేషన్ నాలెడ్జ్, వీటిని ఆధారం చేసుకుంటూ నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంటర్ సిలబస్ అంతా సీబీఎస్‌ఈ స్థాయిలోనే ఉంది కాబట్టి జేఈఈ కోసం ప్రత్యేకంగా చదవాల్సిన అంశాలు చాలా తక్కువ. దీన్ని అనుకూలంగా మలచుకోవాలి. ఇంటర్ సిలబస్‌లోని అంశాలను చదువుతున్నప్పుడే వాటిని కాన్సెప్ట్ ఆధారితంగా, అప్లికేషన్ దృక్పథంతో అధ్యయనం చేస్తే జేఈఈ మెయిన్‌కు కూడా ప్రిపరేషన్ సరిపోతుంది. అదే విధంగా సెల్ఫ్ ప్రాక్టీస్, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్‌లు కూడా మెయిన్‌లో విజయ సోపానాలు.
 - వాకచర్ల ప్రమోద్, జేఈఈ-మెయిన్ 2015 టాపర్
 
 
 జేఈఈ మెయిన్ - 2016 సమాచారం
 అర్హత: బీటెక్ కోర్సు ఔత్సాహికులు 45 శాతం మార్కులతో; బీఆర్క్, బీప్లానింగ్ ఔత్సాహికులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు ఉంటుంది). 2014, 2015లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు; 2016లో చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.
 వయో పరిమితి: అక్టోబర్ 1, 1991 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1986 తర్వాత జన్మించి ఉండాలి.
 
 గరిష్ట పరిమితి: జేఈఈ-మెయిన్‌కు గరిష్టంగా మూడుసార్లు హాజరు కావచ్చు.  
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 1, 2015
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2015
 
 పరీక్ష తేదీలు:
 ఆఫ్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 3
 ఆన్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 9, ఏప్రిల్ 10
 వెబ్‌సైట్: www.jeemain.nic.in
 
 150 మార్కులు లక్ష్యంగా పెట్టుకుంటే..
 జేఈఈ మెయిన్ అభ్యర్థులు 150 మార్కులు లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాలి. అప్పుడే పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌కు గురైనా కటాఫ్ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రిపరేషన్ పరంగా కేవలం రీడింగ్‌కే పరిమితం కాకుండా వీలైనంత మేర ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్స్, డి-బ్లాక్ ఎలిమెంట్స్ వంటి వాటిని నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్‌కు ఉపకరిస్తుంది. ఇక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో అధిక శాతం అంశాలు ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటాయి. కాబట్టి వాటిలో క్లిష్టంగా ఉన్న వాటిని ఛాయిస్ కోణంలో వదిలేద్దాం అనే భావన సరికాదు. తదుపరి పాఠ్యాంశాల్లో రాణింపుపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. జేఈఈ మెయిన్ ఔత్సాహిక అభ్యర్థులు డిసెంబర్ చివరికి జేఈఈ సిలబస్ పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ రూపొందించుకోవడం మేలు.
 - డి.కె.ఝా, డెరైక్టర్, విజన్40 ఐఐటీ
 అకాడమీ, ఆథర్-అరిహంత్ పబ్లికేషన్స్
 
 తెలంగాణ ఇంటర్మీడియెట్
 ఎగ్జామ్-2016 టైం టేబుల్
 ప్రథమ సంవత్సరం
 తేదీ    సబ్జెక్ట్
 మార్చి 2    సెకండ్ లాంగ్వేజ్
 మార్చి 4    ఇంగ్లిష్
 మార్చి 8    మ్యాథ్స్ 1-ఎ, బోటనీ, సివిక్స్,
 సైకాలజీ
 మార్చి 10    మ్యాథ్స్ 1-బి, జువాలజీ, హిస్టరీ
 మార్చి 12    ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్
 మార్చి 15    కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ,
 ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్
 మార్చి 17    జియాలజీ, హోంసైన్స్, పబ్లిక్
 అడ్మినిస్ట్రేషన్
 మార్చి 19    జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్
 ద్వితీయ సంవత్సరం
 తేదీ    సబ్జెక్ట్
 మార్చి 3    సెకండ్ లాంగ్వేజ్
 మార్చి 5    ఇంగ్లిష్
 మార్చి 9    మ్యాథ్స్ 2-ఎ, బోటనీ, సివిక్స్,
 సైకాలజీ
 మార్చి 11    మ్యాథ్స్ 2-బి, జువాలజీ, హిస్టరీ
 మార్చి 14    ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్
 మార్చి 16    కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ,
 ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
 మార్చి 18    జియాలజీ, హోంసైన్స్, పబ్లిక్
 అడ్మినిస్ట్రేషన్
 మార్చి 21    జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement