
అభ్యర్థిత్వాలపై కమలనాథుల కసరత్తు
తెలుగుదేశం పార్టీతో పొత్తు సంగతిని పక్కనపెట్టి అవసరమైతే ఒంటరి పోరుకు సిద్ధం కావాలంటూ శనివారం అధిష్టానం నుంచి ఆదేశం రావటంతో తెలంగాణ కమలనాథులు అభ్యర్థిత్వాల ఖరారుపై దృష్టి సారించారు.
40 అసెంబ్లీ స్థానాలు...
14 ఎంపీ సీట్లపై చర్చ
నేడు ఢిల్లీకి జాబితా... సాయంత్రం
కొన్ని పేర్లు ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు సంగతిని పక్కనపెట్టి అవసరమైతే ఒంటరి పోరుకు సిద్ధం కావాలంటూ శనివారం అధిష్టానం నుంచి ఆదేశం రావటంతో తెలంగాణ కమలనాథులు అభ్యర్థిత్వాల ఖరారుపై దృష్టి సారించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శనివారం సమావేశం నిర్వహించి అభ్యర్థిత్వాలపై సమాలోచనలు జరిపారు. దానికి కొనసాగింపుగా ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు కమిటీ సభ్యులు సమాలోచనల్లో మునిగిపోయారు.
టీడీపీతో పొత్తు అవకాశం పూర్తిగా మూసుకుపోలేద నే పరోక్ష సంకేతాల నేపథ్యంలో... కచ్చితంగా బీజేపీనే బరిలో ఉండాలని భావిస్తున్న నియోజకవర్గాలపైనే కసరత్తు చేస్తున్నారు. ఆదివారం దాదాపు 40 అసెంబ్లీ స్థానాలపై చ ర్చించినట్టు తెలిసింది. సోమవారం ఉదయం మరికొన్ని పేర్లు జోడించి తొలి జాబితాను ఢిల్లీకి పంపాలని కిషన్‌రెడ్డి నిర్ణయించారు. ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి ఢిల్లీకి పంపాలని భావిస్తున్నారు. కొన్నింటికి ఒకే పేరును సూచించగా మరికొన్నింటికి రెండు/మూడు పేర్లకు చోటు కల్పించారు. బీజేపీ నేతల అభిప్రాయాలకు- ఆర్‌ఎఎస్‌ఎస్ నేతల అభిప్రాయాలకు కొన్ని నియోజకవర్గాల్లో భేదాలున్నాయి. అలాంటిచోట్ల చివరి నిమిషంలో మార్పుచేర్పులకు కచ్చితంగా అవకాశం ఉంది. ఉగాది సందర్భంగా సోమవారం తొలి జాబితాగా ప్రకటించాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు సమాలోచనల్లో ఏకాభిప్రాయం సాధించిన కొన్ని స్థానాల అభ్యర్థిత్వాల వివరాలిలా ఉన్నాయి.
పార్లమెంటు స్థానాలు
సికింద్రాబాద్: బండారు దత్తాత్రేయ; మల్కాజిగిరి: ఇంద్రసేనారెడ్డి/ రామచంద్రరావు; చేవెళ్ల: బద్దం బాల్‌రెడ్డి; మహబూబ్‌నగర్: నాగం జనార్దన్‌రెడ్డి; కరీంనగర్: సీహెచ్ విద్యాసాగర్‌రావు/మురళీధర్‌రావు; నిజామాబాద్: ఎండల లక్ష్మీనారాయణ; హైదరాబాద్: భగవంతరావు/సతీష్ కుమార్ అగర్వాల్; భువనగిరి: వెదిరె శ్రీరామ్ / ఇంద్రసేనారెడ్డి; నల్గొండ: జితేందర్ /వెదిరె శ్రీరామ్; నాగర్‌కర్నూలు: పుష్పలీల; వరంగల్: చింతా సాంబమూర్తి/ పరమేశ్వర్ /జైపాల్; మహబూబాబాద్: చంద లింగయ్య; పెద్దపల్లి: కుమార్ /బోడ జనార్దన్; మెదక్: నరేంద్రనాథ్
శాసనసభా స్థానాలు...
హైదరాబాద్ జిల్లా: అంబర్‌పేట: కిషన్‌రెడ్డి; ముషీరాబాద్: లక్ష్మణ్; సికింద్రాబాద్: వెంకట శ్రీనివాసరావు; ఖైరతాబాద్: వెంకట్‌రెడ్డి/ చింతల రామచంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా: ఉప్పల్: ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్; మేడ్చల్: మోహన్‌రెడ్డి; మల్కాజిగిరి: రామచంద్రరావు; కుత్బుల్లాపూర్: మల్లారెడ్డి / భరత్‌సింహారెడ్డి
మెదక్ జిల్లా: సిద్దిపేట: నాయిని నరోత్తమ్‌రెడ్డి (జాబితాలో పేరు ఉన్నా చివరి నిమిషంలో మార్చే అవకాశం ఉంది); దుబ్బాక : రఘునందన్‌రావు; నర్సాపూర్: గోపి; పటాన్‌చెరు: సత్యనారాయణ; సంగారెడ్డి: అంజిరెడ్డి (పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులను తారుమారు చేసే అవకాశం ఉంది)ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్: పాయల శంకర్; ముధోల్: రమాదేవి; నిర్మల్: రావుల రామ్‌నాథ కరీంనగర్ జిల్లా: కరీంనగర్: బండి సంజయ్; జగిత్యాల: సత్యనారాయణ/ రవీందర్‌రెడ్డి; పెద్దపల్లి: రామకృష్ణారెడ్డి; కోరుట్ల: భూమారావు/ డాక్టర్ రఘు
ఖమ్మం జిల్లా: పాలేరు: శ్రీధర్‌రెడ్డ వరంగల్ జిల్లా: జనగామ: కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి నల్గొండ జిల్లా: సూర్యాపేట: సంకినేని వెంకటేశ్వరరావు; నల్గొండ: అమరేందర్‌రెడ్డి; మునుగోడు: మనోహర్‌రెడ్డి; ఆలేరు: కాసం వెంకటేశ్వర్లు/ శ్రీధర్‌రెడ్డి; భువనగిరి: శ్యామ్‌సుందర్‌రావు మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్: ఎన్నం శ్రీనివాసరెడ్డి; కల్వకుర్తి: ఆచారి; షాద్‌నగర్: శ్రీవర్ధన్‌రెడ్డి; కొడంగల్: నాగూరావు నామాజి; నారాయణపేట: రతన్ పాండురెడ్డి; మక్తల్: కొండయ్య నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్: ఎండల లక్ష్మీనారాయణ; ఎల్లారెడ్డి: బానాల లక్ష్మారెడ్డి; బోధన్: కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి; బాల్కొండ: సునీల్ రెడ్డి