పాట్నా: 'నీచ రాజనీతి' వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీపై బీహార్ కోర్టులో ఫిర్యాదు దాఖలయింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి సూరజ్ నందన్ మెహతా స్థానిక కోర్టులో ఈ ఫిర్యాదు చేశారు. ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రామాకాంత్ యాదవ్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శాంతి సామరస్యాలకు భంగం కలిగించేలా ప్రియాంక వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఈ ఫిర్యాదుపై రేపు విచారించే అవకాశముందని కోర్టు వర్గాలు తెలిపాయి. ప్రియాంక వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ అగ్రనాయకులు విమర్శలు గుప్పించాయి. మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
ప్రియాంక గాంధీపై కోర్టులో ఫిర్యాదు
Published Wed, May 7 2014 3:06 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement