ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ | Priyanka Gandhi should apologize to Narendra Modi, country: BJP | Sakshi
Sakshi News home page

ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ

Published Tue, May 6 2014 9:03 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ - Sakshi

ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీకి, జాతికి ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మోడీకి వ్యతిరేకంగా ఆమె చేసిన నీచ రాజనీతి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ నాయకులు సంయమనం కోల్పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ విమర్శించారు. సోనియా గాంధీ కుటుంబం మొత్తం మోడీని లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలంతో దాడి చేస్తోందన్నారు.

రాజకీయాలు క్లీన్గా ఉండాలని, వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. మోడీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి మాత్రమే కాదని, ప్రజలు ఆయనను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. అలాంటి నాయకుడిపై నోరు జారిన ప్రియాంక క్షమాపణలు చెప్పాలని షానవాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement