
సీమాంధ్రలో అన్ని స్థానాలకు బీజేపీ పోటీ?
హైదరాబాద్: సీమాంధ్రలో నామినేషన్ల దశలోనే తెలుగుదేశం, బీజేపీ పొత్తు వికటించింది. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక.. హైడ్రామా మధ్య సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉండదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఆంద్రప్రదేశ్లో అన్ని స్థానాలకు పోటీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం అధికారిక ప్రకటన చేయనున్నారు.