చెన్నై: లోక్సభ ఎన్నికల రోజున ఉద్యోగులకు సెలవు ప్రకటించని ఐటి సంస్థలపై కేసులు నమోదయ్యాయి. గత 24 తేదీన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా షోలింగనల్లూరు ఐటి పార్కులో ఐదు సంస్థలు పనిచేశాయి.
ఉద్యోగుల ఫిర్యాదుల మేరకు షోలింగనల్లూరు తహసిల్దారు రవిచంద్రన్ అక్కడికి వెళ్లి ఉద్యోగులను బయటికి పంపి గేటుకు తాళం వేశారు. ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతించకుండా నిరోధించినందుకు సదరు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సదరు సంస్థలపై ఆదివారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఐటి సంస్థ అధికారులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు.