బీజేపీ కార్యాలయంలో సంబరాలు | Celebrations in bjp office | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయంలో సంబరాలు

Published Sat, May 17 2014 1:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ కార్యాలయంలో సంబరాలు - Sakshi

బీజేపీ కార్యాలయంలో సంబరాలు

లక్ష్మీపురం, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడంపై బ్రాడీపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పొట్రు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల్లో ఉందని, మోడీ ఒక్కరే ఈ పరిస్థితిని అధిగమించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని అన్నారు. సంబరాల్లో పార్టీ జోనల్ ఇన్‌చార్జి ఆర్.లక్ష్మీపతి, వి.పాండురంగ విఠల్, పి.రవిశంకర్, నల్లబోలు విష్ణు, నూతక్కి దశరథ్, మురళి, రాము, డి.గోపాలరావు, సి.హెచ్.హృషికేష్, రాజేష్‌నాయుడు, పేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 అర్బన్ కార్యాలయంలో
 అరండల్‌పేటలోని బీజేపీ అర్బన్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు గులాములు చల్లుకుని, స్వీట్లు పంచుకొనిఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున డప్పులు, మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి జూపూడి రంగరాజు, నగర అధ్యక్షుడు ఆలూరు కోటేశ్వరరావు సహా డ్యాన్సులతో ఆకర్షించారు. సంబరాల్లో పార్టీ నాయకులు మండూరి అమర్‌బాబు, ఉడతా పవన్‌కుమార్, అప్పిశెట్టి రంగారావు, పాలపాటి రవికుమార్, వెలగలేటి గంగాధర్, బొల్లాప్రగడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement