రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా ఆదరణ కోల్పోయింది. ఆ పార్టీ నాయకులు ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి చీవాట్లే ఎదురవుతున్నాయి.
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా ఆదరణ కోల్పోయింది. ఆ పార్టీ నాయకులు ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి చీవాట్లే ఎదురవుతున్నాయి. పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దీనిని తట్టుకోలేని అభ్యర్థులు ఇప్పుడు కొత్త ప్రచారానికి తెరతీశారు. వైఎస్సా ర్ సీపీ గుర్తు హస్తం అంటూ తప్పుడు ప్రచారం చేసి నిరక్షరాస్యులైన ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ ప్రచారం ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నారు. ఎవరైనా దీనిపై నిలదీస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడేనని, కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన సంక్షేమ పథకాలు అమలు చేయగలిగాడని చెబుతూ అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు.
రెండు రోజుల కిందట గడిచిన పదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ ఘనతే అని చెప్పినప్పటికీ ఓటర్లలో స్పందనలేకపోవడంతో రాజశేఖరరెడ్డి పేరును వినియోగించుకుంటున్నారు. దీని ద్వారా తాము లబ్ధిపొందలేక పో యినా తమకు మిత్రత్వంతో ఉన్న టీడీపీకైనా లబ్ధిచేకూర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే, ఇప్పటికే వైఎస్సార్ వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ అని తెలియడంతో నిరక్ష్యరాస్యులు సైతం ఫ్యాన్‌కే మద్దతు తెలిపి సంక్షేమ కార్యక్రమా లు అమలయ్యేలా చూడాలని నిశ్చయించుకున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఇటువంటి కుతంత్రాలపై సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నారుు. ఇప్పటికైనా ఇటువంటి విధానాలను మార్చుకోకుంటే ప్రజలు మరింతగా ఛీత్కరించుకునే పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఎదురవుతుందనడంలో సందేహం లేదు.