తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే
పాలకుర్తి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమైంద ని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు రాపోలు జయప్రకాశ్ అన్నారు. పార్టీ నుంచి ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని ఆదివా రం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సన్మానిం చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో జయప్రకాశ్ మాట్లాడుతూ పూటకో మాట మాట్లాడుతున్న కేసీఆర్‌ను ప్రజ లు విశ్వసించడం లేదన్నారు. ఎంఐఎం, సీపీఐ మద్దతుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. పాలకుర్తిలో దుగ్యాలతోపాటు జిల్లాలో 11 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాయని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిం చిన విధంగా రైతులు, మహిళా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. పరిపాలన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మా ణం సాధ్యమని స్పష్టం చేశారు.
దుగ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ తనతోపాటు ఎంపీటీసీ, జెడీపీటీసీ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, రాపాక సత్యనారాయణ, చిలువేరు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ యాకాంతరావు, మాజీ చైర్మన్ అడ్డూరి రవీందర్‌రావు, పసునూరి నవీన్, ఎండీ.సలీం, బండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.