వెంకటరమణను అరెస్టు చేయొద్దు: హైకోర్టు | Donot arrest Raavi Venkata ramana: High court | Sakshi
Sakshi News home page

వెంకటరమణను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

Published Wed, Apr 30 2014 2:05 AM | Last Updated on Thu, Jul 11 2019 8:44 PM

Donot arrest Raavi Venkata ramana: High court

సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకటరమణను అరెస్టు చేయవద్దని ఎక్సైజ్ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా ఎడ్లపాలెం మండలం మర్రిపాలెం గ్రామంలో ఉన్న జి.టి.టెక్స్‌టైల్స్‌లో ఎక్సైజ్ అధికారులు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో రావి వెంకటరమణను మూడో నిందితునిగా పేర్కొన్నారు. వెంకటరమణను అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
 
  ఈ  వ్యాజ్యాన్ని జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. జి.ఐ.టెక్స్‌టైల్స్‌తోగానీ, అక్కడ దొరికిన మద్యంతోగానీ వెంకటరమణకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదని, దానిని షేక్ బాజీ అనే వ్యక్తికి గత ఏడాది లీజుకు ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది బి.పి.మోహన్ కోర్టుకు నివేదించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వెంకటరమణపై కేసు నమోదు చేశారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, మే 7వ తేదీ వరకు వెంకటరమణను అరెస్టు చేయవద్దని ఎక్సైజ్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement