‘చంద్రబాబుది అధికార దాహం’ | don't believe tdp president nara chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుది అధికార దాహం’

Published Fri, May 2 2014 1:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

‘చంద్రబాబుది అధికార దాహం’ - Sakshi

‘చంద్రబాబుది అధికార దాహం’

 అత్తిలి, న్యూస్‌లైన్: ఏనాడు పేదల పక్షాన మాట్లాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అధికార దాహంతో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్, తణు కు ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల రాధయ్య ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దఎత్తున తరలివచ్చిన వై సీపీ కార్యకర్తలు, అభిమానులతో కలసి గురువారం అత్తిలి మండలంలో రోడ్ షో నిర్వహించారు. వంక రవీంద్ర మాట్లాడుతూ ప్రజాదరణ కోల్పోరుున చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని మరోసారి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మరికొద్ది రోజు ల్లోనే ప్రజలు కోరుకుంటున్న రాజన్న రాజ్యం రానుందని చెప్పారు. వైసీపీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంద ని, రాష్ట్ర భవి ష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు, అన్నివర్గాల వారికి మేలు చేయాలన్న సంకల్పంతో పార్టీ మేనిఫెస్టో రూపొం దించారని తెలిపారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
 
 త్వరలోనే డ్వాక్రా రుణాల మాఫీ
ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల రాధయ్య మాట్లాడుతూ వైసీపీ  అధికారంలోకి రాగానే మహిళల డ్వాక్రా రుణాలను రద్దుచేసి కొత్త రుణాలు ఇచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పా రు. రైతులకు అండగా ఉండేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి, ఏటా రూ.2 వేల కోట్లతో ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ అధినేత నిర్ణరుుంచారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరి స్థితి చుక్కానిలేని నావలా తయారైందని, సీమాంధ్రకు దశ, దిశ నిర్ధేశించగల నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని పేర్కొన్నారు. విద్యుత్ కోతలు లేని పాలన కోసం ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యాలని కోరారు. వైసీపీ ద్వారానే సుస్థిర పాలన అందుతుందన్నారు. రాబోయే ఐదేళ్లలో తణుకు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అత్తిలిలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రచారం మంచిలి, కంచుమర్రు, స్కిన్నెరపురం, చలివేంద్రచెర్వు, లక్ష్మీనారాయణపురం, ఉనికిలి, ఆరవల్లి, దంతుపల్లి, ఈడూరు, కొమ్మర, పాలూరు, ఉరదాళ్లపాలెం, తి రుపతిపురం గ్రామాల మీదుగా సాగిం ది. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు మోటారుసైకిళ్లపై వచ్చి రోడ్ షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
గ్రామగ్రామాన ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఘనస్వాగతం పలికి, పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రముఖ విద్యావేత్త, పార్టీ నాయకుడు గుబ్బల తమ్మయ్య, ఆకుల శ్రీరాములు తనయుడు ఆకుల విష్ణువర్దన్, పార్టీ మండల శాఖ కన్వీనర్ వెలగల అమ్మిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మద్దాల నాగేశ్వరరావు, నాయకులు బుద్దరాతి భరణీప్రసాద్, దాసం ప్రసా ద్, ఎన్నారై విభాగపు నాయకుడు దిరి శాల కృష్ణ శ్రీనివాస్, జొన్నల నరసింహరావు, పైబోయిన సత్యనారాయణ, గూనా మావుళ్లు, చింతలపూడి సూర్యనారాయణ, కొల్లి చిన్ని, రాయుడు ధర్మారావు, కలిగిపూడి చిట్టిరాజు, పోతుల రాము, సైపు సుబ్బయ్య, కొప్పినీడి వాసు, గుబ్బల ఆంజనేయులు, ఆకుల పండుస్వామి, వట్టికూటి సూర్యనారాయణ, వెలగల సత్తిపండురెడ్డి, తేలి సుందరరావు, సర్పంచ్‌లు పెన్మెత్స రామరాజు, పొలమరశెట్టి శ్రీనివాసరావు, కడలి పార్వతి, నీతిపూడి మరి యమ్మ, కేతా గౌరీపార్వతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement