
చంద్రబాబుపై కోడిగుడ్లతో దాడి
ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారానికి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురయింది. బెల్లంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా చంద్రబాబుపై తెలంగాణవాదులు కోడిగుడ్లతో దాడి చేశారు.
దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలంగాణవాదులపై తెలుగు తమ్ముళ్లు ప్రతిదాడికి దిగడంతో బెల్లంపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి వారిని చెదరగొట్టారు. కోడిగుడ్లతో దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.