సాక్షి, ముంబై: 16వ లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైంది. ఈ మహాసంగ్రామంలో అనేక దిగ్గజాలు మరోసారి పోటీకి దిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందినవారిని పరిశీలించినట్టయితే మొత్తం ఆరుగురున్నారు. అయితే వీరిలో రాష్ట్రం నుంచి మాణిక్‌రావ్‌గావిత్ కూడా ఉండడం విశేషం. కాంగ్రెస్ నాయకుడైన మాణిక్‌రావ్ గావిత్ రాష్ట్రంలో నందుర్బార్ నియోజక వర్గంలో గత 34 ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపీ అభ్యర్థులుగా విజయం సాధించినవారి వివరాలను పరిశీలిస్తే. ఇందులో తొమ్మిది, ఎనిమిదిసార్లు విజయం సాధించినవారు ఒక్కొక్కరు కాగా ఏడుసార్లు గెలిచినవారు నలుగురు, ఆరుసార్లు విజయఢంకా మోగించినవారు ఇద్దరు, ఐదు సార్లు విజయం సాధించినవారు 14 మంది ఉన్నారు.
నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు మాణిక్‌రావ్‌గావిత్ అత్యధికంగా తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 1981లో జరిగిన ఏడో లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకు వరుసగా ఆయ న విజయం సాధిస్తూనే ఉన్నారు. నందుర్బార్ జిల్లా దుడిపాడాలో 1934 అక్టోబరు 29న జన్మిం చిన మాణిక్‌రావ్ 1965లో మొట్టమొదటిసారిగా నవపూర్ గ్రామపంచాయితీ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1980లో విధానమండలి (ఎంఎల్ సీ)గా ఎన్నిైకైన గావిత్ 1981 నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.
ఇలా అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూ రికార్డు సృష్టించారు. ఆయన తర్వాతి స్థానంలో ఎనిమిది సార్లు విజయం సాధించిన కోపర్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ బాలాసాహెబ్ విఖే పాటిల్ నిలిచారు. ఆయన ఇప్పటి వరకు ఎనిమిది సార్లు విజయం సాధించారు.
ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందినవారిలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, నాగపూర్ ఎంపీ విలాస్ ముత్తెంవార్, పండరీపూర్ ఎంపీ సందీపాన్ థోరాత్‌లున్నారు.
పీవీదీ అదే పరంపర
దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఎనిమిదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే రెండుసార్లు ఆయన మహారాష్ట్ర నుంచి విజయం సాధించారు. రామ్‌టెక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1984, 1989.. ఇలా వరుసగా రెండుసార్లు పీవీ గెలుపొందారు.
‘మహా’ సంగ్రామం మొదలు
Published Tue, Mar 25 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement