పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది త ప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కాంతిలా ల్ దండే సూచించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. విధుల్లో ఉన్న సిబ్బంది సంబంధిత ని యోజకవర్గం రిటర్నింగ్ అధికారిని కలిసి పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకుని ఓటుహక్కు విని యోగించుకోవాలని తెలిపారు. సిబ్బంది కోసం తొమ్మిది నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈకేంద్రాల్లో రహస్య ఓటింగ్ కంపార్టుమెంట్, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ కోసం అటెస్టేషన్ అధికారి, కవర్ సీల్ కోసం గమ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచటానికి సహకరించాలని కోరారు.
ఫెసిలిటేషన్ కేంద్రాలు
130 కురుపాం మోడల్ పాఠశాల, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట
137 పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం, పార్వతీపురం
132 సాలూరు పభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు
133 బొబ్బిలి ఆర్‌ఎస్‌ఆర్‌కె డిగ్రీ కళాశాల
134 చీపురుపల్లి దుర్గా ప్రసాద్‌ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, గరివిడి
135 గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల
136 నెల్లిమర్ల జ్యోతిరావ్ పూలే బీసీ వసతి గృహం, నెల్లిమర్ల
137 విజయనగరం సెయింట్ ఆన్స్ పాఠశాల, కంటోన్మెంట్
138 ఎస్ కోట తహశీల్దార్ కార్యాలయం, ఎస్. కోట