పొరు గడ్డలో ... హొరు | election war for ellendhu | Sakshi
Sakshi News home page

పొరు గడ్డలో ... హొరు

Published Sun, Apr 20 2014 1:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

పొరు గడ్డలో ... హొరు - Sakshi

పొరు గడ్డలో ... హొరు

 పోరాటాలకు పురిటి గడ్డ...సింగరేణి జడలో విరబూసిన మందారం... ఇల్లెందు. 1978లో ఎస్టీలకు  రిజర్వు అయిన ఈ నియోజకవర్గంలో గిరిజన తెగలైన లంబాడా, కోయ సామాజిక వర్గాల ప్రభావం బాగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆరు సార్లు సీపీఐఎంఎల్ (న్యూడెమొక్రసీ) విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున ఐదు దఫాలు గుమ్మడి నర్సయ్య అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీలో తన గళాన్ని ఎలుగెత్తి చాటిన ఆయన ఇప్పటికీ సాదాసీదాగానే ఉంటారు.  ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఊకె అబ్బయ్యకు టీడీపీ  టికెట్ నిరాకరించడంతో ఆయన అనూహ్యంగా టీఆర్‌ఎస్ నుంచి రంగంలోనికి దిగారు. కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, టీడీపీ నుంచి బానోతు హరిప్రియ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ రవిబాబు నాయక్ బరిలో ఉన్నారు. ఆయనకు సీపీఎం పార్టీ మద్దతు ప్రకటించింది.  విద్యాధికుడు, యువకుడు అయిన రవిబాబు నియోకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
 
 ఇల్లందుల నాగేశ్వరరావు,ఇల్లెందు


 ఎస్టీ నియోజకవర్గంగా 1978లో అవతరించినప్పటినుంచి ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకోవటం మినహా ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూలించే అంశమేదీ లేదు. ఐదేళ్లుగా ఇక్కడి నుంచి  టీడీపీ  ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య ప్రాతినిధ్యం వహించారు.  నియోజకవర్గాన్ని విస్మరించారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సొంత పార్టీ నేతలే గతంలో ఆయన పనితీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు  చేశారు.  కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కోరం కనకయ్యకు సొంత పార్టీలోని రేణుక వర్గం సహకరించటం లేదు. పార్టీఅభ్యర్థులందరినీ ఓడించాలన్న ధ్యేయంతో ఈ వర్గం పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. బంజారాలకు జిల్లాలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉంది.  కనకయ్య వెంట ఉన్న నాయకులు కూడా ఆయన గెలిస్తే అధికారాన్ని చెలాయించాలని ఆశిస్తున్నవారేనన్న విమర్శలున్నాయి.
 
బాబే లక్ష్యంగా..

 సిట్టింగ్ అయిన తనను కాదని రాత్రికి రాత్రి బానోత్ హరిప్రియకు కేటాయించడం పట్ల అసంతృప్తితో అబ్బయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. గిజనుడిని కావడంవల్లనే జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తన ఒక్కడికే టికెట్టివ్వలేదని చెబుతూ ఆయన జనంలోకి వెళుతున్నారు. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి  తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి టీడీపీ ఓటు బ్యాకును తాను చీల్చుతానంటున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగినా ఇక్కడ టీఆర్‌ఎస్ ఆ స్థాయిలో ఇక్కడ బలపడలేకపోయింది. అబ్బయ్య సొంత బలంతో పాటు సెంటిమెంటు మీద ఆశతో ఉంది.  న్యూ డెమొక్రసీ రెండు వర్గాలుగా చీలింది. గుమ్మడి నర్సయ్య వ్యక్తిగత ప్రతిష్టతోనే గట్టెక్కుతారన్న దీమాతో ఉన్నారు.
 
సామాజిక వర్గం అండ... వైఎఎస్సార్ సీపీ తరఫున యువకుడు, విద్యావంతుడు, వైద్యుడు, బంజారా సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ జి.   రవిబాబు బరిలోకి దిగారు. అత్యధిక ఓటు బ్యాంకు అయిన పొంత సామాజికవర్గం రవిబాబుకు అండగా ఉండనుంది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాపై ప్రజలనుంచి కనిపిస్తున్న ఆదరణ ఆయనకు అనుకూలించనుంది.  మిగతాపార్టీల్లో ఉన్న అసంతృప్తులు కూడా ఆయనకు అనుకూలించే అవకాశం ఉంది.
 
 అసెంబ్లీ నియోజకవర్గం ఇల్లెందు
 ఎవరెన్నిసార్లు గెలిచారు:
 న్యూడెమోక్రసీ - 6, సీపీఐ - 1, టీడీపీ-1
 ప్రస్తుత ఎమ్మెల్యే:  ఊకె అబ్బయ్య
 (టీడీపీ - ప్రస్తుతం టీఆర్‌ఎస్)
 రిజర్వేషన్: ఎస్టీ
 నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ లంబాడా ఓట్లు ఎక్కువ. గెలుపు ఓటములను ప్రభావితం చేసేది గిరిజనేత రులే
 
ప్రస్తుతం బరిలో నిలిచింది: 15
 ప్రధాన అభ్యర్థులు వీరే..
 డాక్టర్ జి.రవిబాబు (వైఎస్సార్‌సీపీ)
 కోరం కనకయ్య (కాంగ్రెస్)
 ఊకె అబ్బయ్య (టీఆర్‌ఎస్)
 బానోత్ హరిప్రియ (టీడీపీ)
 గుమ్మడి నర్సయ్య (ఎన్డీ)
 
 ల్లెందు మంచినీటి చెరువు అభివృద్ధి
 ఇల్లెందు చెరువులోకి దుమ్ముగూడెం
కాలువలను మళ్లించటం.
 బయ్యారంలో పెద్ద చెరువు అభివృద్ధి..
 తులారం ప్రాజెక్టు అభివృద్ధి.
 గార్లలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం
 బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు కృషి
     - గుమ్మడి నర్సయ్య(ఎన్డీ)
 
 ఇల్లెందు, బయ్యారం చెరువులను అభివృద్ధి
వైద్యశాలను అభివృద్ధి చేయడం.
తులారం ప్రాజెక్టు అభివృద్ధి,
గార్లలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం -తాగునీటి ఎద్దడి తీర్చటం.
కామేపల్లి మండలం రాయిమాధారం చెక్‌డ్యాం, సీపీడబ్ల్యూ స్కీం ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు తాగునీటిని
     సరఫరా    -డాక్టర్ జి.రవిబాబు (వైఎస్సార్‌సీపీ)
 

 బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి
 ఇల్లెందు బస్టాండ్ అభివృద్ధి పర్చటం
 విద్యావైద్యసదుపాయాలు కల్పించటం
 మంచీనిటి చెరువు అభివృద్ధి
బేతంపూడి,రాయిమాధారం సీపీడబ్ల్యూ స్కీంల ఏర్పాటు, గ్రామాల ప్రజల దాహార్తి తీర్చటం
 - ఊకె అబ్బయ్య(టీఆర్‌ఎస్)
 
 ఇల్లెందు పట్టణంలో క్రమబద్ధీకరణ
మంచినీటి చెరువు అభివృద్ధి
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పటం,
 యువతకు ఉపాధి కల్పించటం,
విద్యవైద్య సదుపాయాలు కల్పించటం
 - కోరం కనకయ్య(కాంగ్రెస్)
 
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు.
ఇల్లెందు బస్టాండ్ అభివృద్ధి పర్చటం
మంచీనిటి చెరువు అభివృద్ధి
బయ్యారంలో పెద్ద చెరువు అభివృద్ధి..
తులారం ప్రాజెక్టు అభివృద్ధి,
 గార్లలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం-
 తాగునీటి ఎద్దడి తీర్చటం.
 -  బానోత్ హరిప్రియ (టీడీపీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement