సాక్షి, చెన్నై:రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.330 కోట్లు. ఇందులో పోలీసు భద్రతకు రూ.30 కోట్లు, సిబ్బంది అలవెన్సులకు రూ.60 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం తలమునకలై ఉంది. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ బూత్‌ల ఎంపిక పూర్తయింది.
ఆయా కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులు, సిబ్బంది నియామకం, ఎన్నికల రోజున వ్యవహరించాల్సిన విధివిధానాలపై కసరత్తుల్లో అధికార యంత్రాంగం ఉంది. అలాగే రాష్ట్రంలో ఓటర్లకు తాయిలాల పంపిణీ, నగదు బట్వాడాకు అడ్డుకట్ట లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగం ముందుకెళుతోంది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి బలగాల్ని రప్పించారు. ప్రత్యేక స్క్వాడ్‌లు రంగంలోకి దిగారుు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు మొదలు, నామినేషన్ల పరిశీలనా వ్యవహారాలు, ఎన్నికల కోసం నియోజకవర్గాల్లో ప్రత్యేక ఇన్‌చార్జ్‌ల నియామకం... ఇలా అన్ని రకాల పనుల్లో ఎన్నికల అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఐదేళ్లకు ఓ మారు వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అన్నది అందరికీ తెలిసిందే. ఈ పర్యాయం ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో రూ.330 కోట్లు ఖర్చుకానుంది. పకడ్బందీగా ఎన్నికల్ని నిర్వహించాలంటే మరింత చమటోడ్చక తప్పదు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టిన కట్టుదిట్టమైన భద్రత కన్నా, ఈ పర్యాయం అంతకు రెండింతలు భద్రత కల్పించడంతో పాటు అన్ని రకాల తాయిలాల కట్టడి లక్ష్యంగా ఈసీ ముందుకు సాగుతోంది. ఇందు కోసం పెద్ద ఎత్తున బలగాలు తనిఖీల్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతా విధులకు పారా మిలటరీ రంగంలోకి దిగనుంది.
ఈ భద్రతా ఖర్చుల నిమిత్తం రూ.30 కోట్లు కేటాయించారు. అలాగే భద్రత, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం రూ.60 కోట్లు ఖర్చుకానున్నారుు. ఎన్నికల విధులతో పాటు, నామినేషన్ల పర్వం ఆరంభం, ఎన్నికల నిర్వహణ, ఎన్నిక రోజు చేపట్టనున్న ఏర్పాట్లు, ఈవీఎంలు, వెబ్ కెమెరాలు, వీడియో చిత్రీకరణ తదితర వ్యవహారాలతో పాటు ఓట్ల లెక్కింపు ఖర్చు మరో రూ.240 కోట్లు ఖర్చుకానున్నారుు. దీనిపై ఈసీ ప్రవీణ్‌కుమార్ మీడియూతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు మొత్తం రూ.330 కోట్లు అవసరం కానుందని పేర్కొన్నడం గమనార్హం.
ఎన్నికల ఖర్చు రూ.330 కోట్లు
Published Thu, Mar 27 2014 12:18 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement