భర్త గెలుపు కోసం వీర తిలకం దిద్ది ప్రచారానికి సాగనంపి ఊరుకోలేదీ సతీమణి. దేశం, భాష కాకపోయినా.. పతిదేవుడి విజయం కోసం ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొడుకు గౌతమ్ గొగోయ్ అస్సాంలోని కాలియాబర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ బరిలోఉన్నారు. ఐదు నెలల క్రితమే బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్ క్లైర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. భర్త విజయం కోసం తనవంతు సాయం చేయాలనుకున్న ఎలిజబెత్ భర్తతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
అస్సామీ భాష రాకపోవడం ఇబ్బందిగా మారడంతో పట్టుబట్టి కొద్ది రోజుల్లోనే అస్సామీ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు సభల్లో తన భర్తకు ఓటేయమంటూ అస్సామీలోనే ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘ఎలిజబెత్ చాలా తొందరగా అస్సామీ నేర్చుకుంది. తన ప్రసంగాలకు మంచి స్పందన వస్తోంది’ అంటూ గౌరవ్ గర్వంగా చెబుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన గౌరవ్ ప్రస్తుతం రెండు స్వచ్చంధ సంస్థలను నడుపుతున్నారు. ఎలిజబెత్ కూడా ‘లీడ్ ఇండియా’ అనే ఎన్‌జీఓలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
పతి గెలుపే సతి లక్ష్యం
Published Sat, Apr 5 2014 1:41 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement