స్థానిక సంస్థల తొలి విడత సమరం ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది.
హైదరాబాద్: స్థానిక సంస్థల తొలి విడత సమరం ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నారు.
జెడ్పీటీసీకి తెలుపు రంగు, MPTC గులాబి రంగు బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారు. 6,370 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి 95,031 మంది పోలీసులను మోహరించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.