విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్నందున జిల్లా అధికారులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. ఏప్రిల్ 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున సమర్ధ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలన్నా రు. తన చాంబర్‌లో నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి తప్పిదాలకు తావివ్వకుండా సమర్ధంగా పని చేయూలన్నారు.
ఏప్రిల్ 6, 8 తేదీల్లో జరగను న్న స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు, పోలీస్ సిబ్బందిని వెంటనే కేటారుుంచాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 2083 పోలింగ్ కేంద్రాలకు 15,600 మంది సిబ్బందిని గుర్తించి ఎన్నిక ల విధులకు కేటారుుంచాలని మేన్‌పవర్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి అరుున సీపీఓ మోహనరావును ఆదేశిం చారు.
ఎన్నికల విధులకు సంబంధించి మహిళలకు, వృద్ధులకు కొండ ప్రాంతాలు, మావోరుుస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు వేయరాదన్నారు. వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీని పోలింగ్‌కు వినియోగిస్తున్నా.. 700 మంది మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 10న జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రానున్నారని, వీరికి ప్రొటోకాల్, వాహన రవాణా, వసతి, అటెండర్, స్టెనో వంటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని గృహ నిర్మా ణ శాఖ పీడీ సీహెచ్‌యూ కుమార్‌ను ఆదేశించారు. ఎంపీ నియోజకవర్గానికి ముగ్గురు పరిశీలకులు, మరో ముగ్గురు వ్య పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గానికి తొమ్మిది మంది పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు 15 నుంచి 18 మంది వరకు రావచ్చని కలెక్టర్ చెప్పారు.
వీరికి సామగ్రి, మ్యాప్‌లు, పోలింగ్ కేంద్రాలు వంటి పూర్తి సమాచారాన్ని అందజేయూలని జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరావుకు ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియకు ముందే పోలింగ్ అధికారులు, ఏపీఓలకు శిక్షణ పూర్తి చేయూలన్నారు. 2600 మంది పీఓలుచ, మరో 2600 ఏపీఓలకు మొదటి విడతలో శిక్షణ పూర్తి చేయూలన్నారు. ఈవీఎంల పరిశీలన ఈ నెలాఖ రు నాటికి పూర్తి చేయూలని సూచించారు.
5850 ఈవీఎంలు అవసరం కాగా, 4600 వచ్చాయన్నా రు. మిగతావి రెండు రోజుల్లో వస్తాయని చెప్పా రు. 2860 ఈవీఎంలను పరిశీలించామని ఈడీ ప్రసాద్ చెప్పారు. వాహనాలు, సిబ్బంది తదితరమైన వాటిని కేటగిరీల వారీగా సేకరించి జేసీ, ఏజేసీల ఆధ్వర్యంలో సరఫరా చేయూలని రవా ణా శాఖాధికారి రవూఫ్‌ను ఆదేశించారు. అవసరమైన ఫారాలు, కవర్లు, హ్యాండ్‌బుక్‌లు, ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు ఏర్పాటును డీఆర్‌డీఏ పీడీ జ్యోతికి అప్పగించారు. ఎన్నికల నియూమవళిపై దృష్టి సారించాలని ఆదేశించారు.
ఉల్లంఘన సంఘటనలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఖజానా శాఖ ఉప సంచాలకులు పీవీ భోగారావుకు సూచించారు. గుర్తించిన వ్యయూన్ని మూడు రిజిస్టర్లలో నమోదు చేసి నివేదికలు అందజేయూలన్నారు. పెరుుడ్ న్యూస్ విషయంలో మీడియూ సర్టిఫికేషన్ కమిటీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నియూమవళి ఉల్లంఘనలపై టోల్ ఫ్రీ 1070తో పా టు ల్యాండ్ లైన్ నంబరు 08922-277971కు ఫిర్యాదు చేయాలని ప్రజలు, ఓటర్లకు కలెక్టర్ విజ్ఙప్తి చేశారు. సమావేశంలో పౌర సంబంధాల శాఖ సహాయ సంచాల కులు జాన్సన్ ప్రసాద్, డీపీఆర్‌ఓ గోవిందరాజు, మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి
Published Sun, Mar 23 2014 3:46 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement
Advertisement