'ప్రజల వద్ద తేల్చుకుందాం' | Harish Rao challenged Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

'ప్రజల వద్ద తేల్చుకుందాం'

Published Sat, Mar 29 2014 7:46 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

'ప్రజల వద్ద తేల్చుకుందాం' - Sakshi

'ప్రజల వద్ద తేల్చుకుందాం'

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో టీఆర్‌ఎస్ పాత్ర ఎంతో ప్రజల వద్దే తేల్చుకుందాం అని టిఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సవాల్ విసిరారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో రెండు నెలలు ఇంట్లో ఉండి ఫైళ్లపై సంతకం చేసిన చరిత్ర నీదని పొన్నాలపై మండిపడ్డారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర పొన్నాలదని విమర్శించారు. తెలంగాణపై ఏ అంశంపైన అయినా పొన్నాలతో బహిరంగ చర్చకు సిద్ధం అని  హరీష్‌రావు సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement