ఇందూరు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జిల్లా అధికార యంత్రాంగంచు రుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 6, 11 తేదీలలో ఎన్నికలు జరిపేందుకు ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికార యంత్రాంగం గుర్తించింది. మొత్తం 718 గ్రామ పంచాయతీలలో, 1,765 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దోమకొండ, తాడ్వాయి మండలాలలో ఎక్కువ సమస్యాత్మక, వేల్పూర్, సిరికొండ, సదాశివనగర్, నాగి రెడ్డిపేట్, లింగంపేట్ మండలాలలో అతి తక్కువ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు వాటి భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను పోలింగ్ కేంద్రాలలో 171 వెబ్ కెమె రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ట్రి పుల్ ఐటీ విద్యార్థు ల సేవలను వినియోగించుకోనున్నారు. అదేవిధంగా 114 వీడియోలను అద్దెకు తీసుకుని పోలింగ్ సరళిని చిత్రీకరించనున్నారు. ఎన్నికల ను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు 278 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. సూమా రు 10 నుంచి 12మంది వరకు నోడ ల్ అధికారులను,రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ప్రద్యు మ్న నియమించారు. ప్రిసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ బూత్‌స్థాయి అధికారుల నూ నియమించారు. రిటర్నింగ్, నోడల్ అధికారులతో కలెక్టర్ ప్రతి రోజు సమీక్షిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణపై అధికారులకు జిల్లా కేం ద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.ఐదు రోజు ల పాటు మండల, రెవెన్యూ డివిజన్‌లవారీగా శిక్ష ణ తరగతులు కొనసాగుతాయని సంబంధిత అధి కారులు తెలిపారు. మూడు వేలకుపైగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, 20 వేల మెట్రిక్ టన్నుల తెల్ల కాగితాలతో బ్యాలెట్ పత్రాలను ముద్రణ చేస్తున్నారు. పోలీసు శాఖ పకడ్బందీ బందోబస్తుకు కసరత్తు చేస్తోంది.
చురుకుగా ఏర్పాట్లు
Published Thu, Mar 27 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement