ఇందూరు, న్యూస్‌లైన్: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థిత్వాల ఉపసంహరణ గడు వు సోమవారంతో ముగియనుంది. జిల్లాలో 36 జడ్పీటీసీ స్థానాలకుగా ను 497 నామినేషన్‌లు, 583 ఎంపీటీసీ స్థానాలకు గాను 4,752 నామినేషన్‌లు దాఖలైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఎంతో ఉత్సాహంతో నామినేషన్‌లు వేసిన వివిధ పార్టీలకు చెందిన నేతలు టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపంతో నామినేషన్‌ల ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. సుమారు 40 శాతం మంది అభ్యర్థులు నామినేషన్‌లను ఉపసంహరించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్యాకేజీల గొడవ
ప్రధాన పోటీదారులు తమ విజయానికి ఆటంకంగా మారుతున్నవారి అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకునేందుకు ప్యాకేజీలను మాట్లాడుకుం టున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి సుమారు ఐదారుగురు పోటీలో నిలబడవచ్చని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన మొత్తం జడ్పీటీసీ స్థానాలకు రెం డు వందలకుపైగా, ఎంపీటీసీ స్థానాలకు మూడు వేల మందికిపైగా పోటీ లో ఉండచ్చని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గం టల వరకు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాను మండల కార్యాలయాలలో ప్రదర్శించడంతోపాటు, అక్కడి రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు.
‘బి’ ఫారం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానే..
అభ్యర్థులు నామినేషన్‌లు వేసిన సమయంలో వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ధ్రువీకరణ పత్రాలను సమర్పించలేదు. అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలలోగా ‘బి’ఫారాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. లేదా అధికారులు సాయంత్రం ప్రకటించే తుది జాబితాలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ‘బి’ఫారాల కోసం వివిధ పార్టీల అభ్యర్థులు అగ్రనేతల వద్ద తంటాలు పడుతున్నారు. పార్టీ టికెట్లు దొరకని పక్షంలో కొంతమంది ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బరిలో ఎవరో?
Published Mon, Mar 24 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement