లగడపాటి ఓ జోకర్‌: లక్ష్మీపార్వతి | Lagadapati Rajagopal is a Joker, says Lakshmi Parvathi | Sakshi
Sakshi News home page

లగడపాటి ఓ జోకర్‌: లక్ష్మీపార్వతి

Published Sun, May 4 2014 9:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

లగడపాటి ఓ జోకర్‌: లక్ష్మీపార్వతి - Sakshi

లగడపాటి ఓ జోకర్‌: లక్ష్మీపార్వతి

అనంతపురం: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ జోకర్‌ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో లగడపాటి కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. రాయదుర్గంలో ఆమె విలేకరలుతో మాట్లాడుతూ... లగడపాటి అసత్య సర్వేలు వెల్లడిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర విభజనకు లగడపాటి సహకరించారని ఆరోపించారు. ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement