లగడపాటి సర్వే అంతా బోగస్: షబ్బీర్ అలీ | Lagadapati Rajagopal Survey Bogus, says Shabbir Ali | Sakshi
Sakshi News home page

లగడపాటి సర్వే అంతా బోగస్: షబ్బీర్ అలీ

Published Thu, May 15 2014 8:16 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

లగడపాటి సర్వే అంతా బోగస్: షబ్బీర్ అలీ - Sakshi

లగడపాటి సర్వే అంతా బోగస్: షబ్బీర్ అలీ

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన ఎన్నికల సర్వే అంతా బోగస్ అని కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ కొట్టిపారేశారు. తన ఆస్తులను కాపాడుకునేందుకు టీడీపీతో లగడపాటి కుమ్మక్కయ్కారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్కు 50 నుంచి 55 సీట్లు వస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కామారెడ్డిని సిద్దిపేటలో కలవనివ్వబోమని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కామారెడ్డిని జిల్లాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేటను కామారెడ్డిలో కలుపుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement