మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా | manmohan singh may shift to motilal nehru road bungalow before lok sabha results | Sakshi
Sakshi News home page

మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా

Published Mon, Apr 7 2014 2:07 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా - Sakshi

మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత మన్మోహన్‌సింగ్.. మోతీలాల్ నెహ్రూ రోడ్‌లోని మూడో నంబర్ బంగళాలోకి మారనున్నారు. అరుయితే మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికాక ముందే ఆయన కొత్త నివాసంలోకి మారవచ్చని సమాచారం. ఈ నెల 30 తేదీలోగా బంగళాలో పనులన్నీ పూర్తి చేయూల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం ప్రజా పనుల విభాగాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 30వ తర్వాత ఏ రోజైనా ప్రధాని ఆ ఇంటికి మారవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
 
 1920లో నిర్మించిన ఈ నాలుగు పడక గదులతో కూడిన బంగళా సుమారు 3.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోనే ఓ జీవ వైవిధ్య పార్కు కూడా ఉంది. కాగా బంగళాకు కొత్తగా రంగులు వేయడంతో పాటు గచ్చు, పైకప్పు ఇతర మరమ్మతులకు రూ.35 లక్షలు వెచ్చించారు. ఈ బంగళాలో ఇంతకుముందు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉండేవారు. ఫిబ్రవరిలో ఆమె ఖాళీ చేసిన తర్వాత ప్రధాని, ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ ఈ బంగళాను సందర్శించి ఖరారు చేశారు. వీరు ప్రస్తుతం రేస్‌కోర్స్ రోడ్‌లోని ప్రధాని అధికార నివాసంలో ఉంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement