ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు పుస్తకంలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్‌ను యూపీఏ-2 హయాంలో కాంగ్రెస్ నిర్వీర్యుడిని చేసిందని ఆయన సన్నిహితుడు, మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు ఓ పుస్తకంలో వ్యాఖ్యానించారు. యూపీఏ-2 పాలనలో కేబినెట్, ప్రధాని కార్యాలయంలో కీలక నియామకాలపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీనే నిర్ణయాలు తీసుకునే వారని, మన్మోహన్ ఆమెకు, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు తలొగ్గారని పేర్కొన్నారు. ‘ఇక్కడ రెండు అధికార కేంద్రాలు ఉన్నాయి.
దీంతో గందరగోళం ఏర్పడుతోంది. పార్టీ ప్రెసిడెంటే అధికార కేంద్రమని నేను అంగీకరించాల్సి వస్తోంది’ అని మన్మోహన్ తనతో చెప్పారని వెల్లడించారు. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్- ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ పేరుతో బారు రాసిన పుస్తకం శుక్రవారం విడుదలైంది.
బారు 2004-09 మధ్య ప్రధానికి సలహాదారుగా పనిచేశారు. సోనియా.. మన్మోహన్‌ను సంప్రదించకుండానే ప్రణబ్‌ను ఆర్థికమంత్రిని చేశారని, అధికారంపై ఆమె విముఖత కేవలం రాజకీయ వ్యూహమేనని విమర్శించారు. ప్రధాని ఆమోదించాల్సిన కీలక ఫైళ్లకు సంబంధించి పీఎంఓ ముఖ్య కార్యదర్శి పులోక్ ఛటర్జీ సోనియా ఆదేశాలు తీసుకునేవారని తెలిపారు.కాగా, కేంద్రంలో రెండు అధికార కేంద్రాలున్నాయని ఈ పుస్తకం తేటతెల్లం చేసిందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు.
మన్మోహన్.. సోనియాకు తలొగ్గారు!
Published Sat, Apr 12 2014 1:55 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement