తెలంగాణపై సోనియా ప్రకటన చేసిన చోటే సభ
సభను విజయవంతం చేయాలి
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
భువనగిరి, న్యూస్‌లైన్, భువనగిరిలో ఈ నెల 26న జరిగే భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం సాయంత్రం భువనగిరి మండలం మోత్కూరు రోడ్డులోని కూనూరు సమీపంలో ప్రధాని సభ జరిగే ప్రాంగణాన్ని ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009లో ఇక్కడే జరిగిన బహిరంగసభలో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానని ఇక్కడే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ఆకాంక్షను మన్నించి పార్లమెంట్‌లో బిల్లు ఆమోదింప చేసిన మహోన్నత వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
అలాంటి నాయకుడు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వస్తున్న సభకు 3లక్షల మంది జనం హాజరౌతారన్నారు. 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన గొప్ప ప్రధాని మన్మోహన్ అని చెప్పారు. మన్మోహన్ సింగ్ ఇక్కడికి రావడం మన అదృష్టమన్నారు.
ఆయనకు ఘన స్వాగతం పలకడానికి తరలి రావాలని ప్రజలను కోరారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానికి సభావేదికను ఉద్ధేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సభా ఏర్పాట్లను ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పరిశీలిస్తారని చెప్పారు. గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రధాని సభకు అన్ని రకాల చర్యలను తీసుకుంటానని చెప్పారు.
వీరీ వెంట జిలాపరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డినారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, కేశవపట్నం రమేష్, సందెల సుధాకర్, ఉపేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఈర పాక నర్సింహలున్నారు.
ప్రధాని సభా స్థలిని పరిశీలించిన
ఎస్పీజీ డీఐజీ
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పాల్గొనే బహిరంగ సభాస్థలిని బుధవారం సాయంత్రం ఎస్పీజీ డీఐజీ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావు ఉన్నారు.
26న భువనగిరిలో ప్రధాని ప్రచారం
Published Thu, Apr 24 2014 1:57 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement