
రాహుల్ గాంధీపై కేసు పెట్టలేదు: సీఈసీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ తెలిపారు. వారణాసి లేదా ఏ ఇతర నిర్ణయాల్లో తమ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తలేదని వెల్లడించారు. కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. వారణాసి సహా తాము తీసుకున్న అన్ని నిర్ణయాల్లో ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ కూడా ఉన్నారని తెలిపారు.
ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందన్న బీజేపీ ఆరోపణలను సంపత్ తోసిపుచ్చారు. అమేథీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.