చెన్నై, సాక్షి ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా శనివారం తమిళనాడు, పుదుచ్చేరీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ తొలిరోజున నామినేషన్ వేయలేదు. ఈనెల 5వ తేదీన ఎన్నికల షెడ్యూలు విడుదల కాగా ఒకే విడతలో ఈ నెల 24 వ తేదీన పోలింగ్‌ను ముగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిం చడం ప్రారంభించారు. ఉత్తర చెన్నై స్థానానికి ఎస్‌టీపీఐ అభ్యర్థి నిజాంముకై ద్దీన్, కోవై స్థానానికి సీపీఎం అభ్యర్థి పీఆర్ నటరాజన్, దిండుగల్లు స్థానానికి ఉళైప్పాలీ పార్టీ తరపున బాలసుబ్రమణియన్, తంజావూరు స్థానానికి వోలాలర్ మున్నేట్ర మున్నని అభ్యర్థిగా ఎన్ గుణశేఖరన్, కడలూరులో సీపీఐ అభ్యర్థి ఆర్ బాల సుబ్రమణ్యన్ నామినేషన్లు వేశారు.
బాహ్య ప్రపంచంలోకి ఉదయకుమార్
కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్న ఉదయకుమార్, పుష్పరాయన్,
నామినేషన్ల పర్వం జేసురాజన్ ఎన్నికల పుణ్యమా అని రెండున్నరేళ్ల తరువాత బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం వల్ల పర్యావరణ వినాశనం, ప్రజల ప్రాణాలకు విఘాతం అంటూ ఇడిందకరై గ్రామమే కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున పోరాటాలు ప్రారంభించారు.
పోలీసుల నిషేధాజ్ఞలను ధిక్కరించి ఆందోళనలు సాగిస్తున్న వీరిపై సుమారు 400 కేసులున్నాయి. ఉద్యమకారులకు గ్రామస్తుల మద్దతు కారణంగా పోలీసులు వారిని అరెస్ట్ చేయలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత ప్రశాంత్‌భూషణ్ ఇటీవల ఉదయకుమార్ తదితరులను కలుసుకుని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ముగ్గురు ఉద్యమకారులు పోటీచేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఎన్నికల ప్రచారం కోసం గ్రామం విడిచివెళితే అరెస్ట్ చేస్తారన్న సందేహంతో ఇటీవలే ముందస్తు బెయిల్‌కు మధురై హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పట్లో వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది స్పష్టం చేయడంతో వారంతా బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు. కన్యాకుమారి స్థానానికి ఉదయకుమార్, నెల్లైకు ఫాదర్ జేసురాజన్, తూత్తుకూడికి పుష్పరాయన్ శనివారం నామినేషన్లు దాఖలు చేశారు.
ముహూర్తాలు పెట్టుకున్న పార్టీలు
అన్నాడీఎంకే అభ్యర్థుల 1వ తేదీ మధ్యాహ్నం 1.30 నుండి 3 గంటల లోగా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎండీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీల అభ్యర్థులు సైతం అదేరోజున నామినేషన్లు వేస్తారు.కాంగ్రెస్, డీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లు 2వ తేదీ వేయనున్నారు. పీఎంకే, పుదియ తమిళగం పార్టీ 3న, డీఎంకే కూటమిలోని వీసీకే అధినేత తిరుమావళవన్ 4న, బీజేపీ కూటమిలోని డీఎండీకే 5న నామినేషన్ వేసేందుకు సుముహూర్తం పెట్టుకున్నారు.
నామినేషన్ల పర్వం
Published Sat, Mar 29 2014 11:49 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement