Udayakumar
-
భలే మంచి చౌక బేరం
ఏపీ ఎండోమెంటు భూముల వేలం ఖరీదైన భూములు కారు చౌక ఎకరా రూ.27 లక్షలు చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు శాఖ వారి నిర్వాకం కారణంగా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. దక్కిందే చాలనుకున్న ఏపీ ఎండోమెంటు అధికారులు వేలం పాటల ద్వారా పొందిన రూ.23 కోట్లతో సరిపెట్టుకున్నారు. అమరావతిలో శివాలయంలో పూజాది కార్యక్రమాల నిమిత్తం గుంటూరు జిల్లాకు చెందిన వాసిరెడ్డి వెంకటాద్రి రామలక్షమ్మ అనే మహిళ 471 ఎకరాల భూమిని అమరావతిలోని సభావర్తి సత్రానికి రాసిచ్చేశారు. కాంచీపురం జిల్లాలోని ఈ భూములను 1945-50 మధ్యకాలంలో ఆమె అప్పగించారు. అయితే ఇటీవలి వరకు ఆ భూములను ఎండోమెంటు వారు స్వాధీనం చేసుకోలేదు. ఏపీ విడిపోయిన సందర్భంలో రికార్డులను తిరగేస్తుండగా ఈ భూముల వివరాలు బైటపడ్డాయి. తమిళనాడు ప్రభుత్వం సహకారంతో భూములను గుర్తించే ప్రయత్నం చేయగా 471 ఎకరాలకు గానూ కేవలం కేవలం 83.11 ఎకరాల భూమిని మాత్రమే కనుగొనగలిగారు. ఈ కొద్దిపాటి భూములు సైతం ఎన్నో ఏళ్ల క్రితమే అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ భూములను వేలం వేసుకోవచ్చని కాంచీపురం జిల్లా కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ ఎండోమెంటు జాయింట్ కమిషనర్ కృష్ణాజీరావు, శ్రీకాళహస్తి ఆలయ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్ భ్రమరాంబ, ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం విజయరాజ, అమరావతి ఈఓ శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు ఉదయకుమార్ (చెన్నై), శేషుమోహన్ (గుంటూరు) సోమవారం చెన్నై రాయపేటలోని ఒక పాఠశాలలో టెండర్ల దాఖలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు టెండర్లను స్వీకరించారు. టెండర్లలో శాఖాపరంగా గిట్టుబాటైన ధరను కోడ్ చేసి ఉన్నట్లయితే వారికే భూములను అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి,గోపిరాజు, చెన్నైకి చెందిన రాధాకృష్ణ టెండర్లు వేశారు. అలాగే చెన్నైలో తెలుగు ప్రముఖులైన ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ అధ్యక్షులు తంగటూరి రామకృష్ణ, వీజీఏ హోమ్స్ డైరక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా టెండరు వేశారు. ఎండోమెంటు వారు ఎకరాకు రూ.50లక్షలు ఆశించగా గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి రూ.26లక్షలకు టెండరు వేశారు. దీంతో వేలంపాట నిర్వహించడం అనివార్యమైంది. ఎండోమెంటు వారిపాట రూ.50లక్షలు అంటూ ప్రారంభించగా టెండరుదారులు ఎవ్వరూ నోరుమెదపలేదు. వేలం పాటల్లో విలువ పెరగాల్సి ఉండగా ప్రతి ఐదు నిమిషాలకు రూ.5 లక్షల చొప్పున తగ్గించుకుంటూ వచ్చారు. రూ.35 లక్షల వద్ద, ఆ తరువాత రూ.30లక్షల వద్ద వేలంపాట ఎక్కువ సేపు స్థంభించిపోయినా నలుగురిలో ఎవ్వరూ నోరుమెదపలేదు. గిట్టుబాటు ధర పలకని పక్షంలో వేలం రద్దుచేస్తారా అన్ని అధికారులను ప్రశ్నించగా, ఏదో ఒక ధరకు సెటిల్ చేస్తామని బదులిచ్చారు. ఎట్టకేలకూ గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరెడ్డి ఎకరా రూ.27 లక్షల 188లకు వేలం పాట ద్వారా సొంతం చేసుకున్నారు. అంటే మొత్తం 83.11 ఎకరాలను రూ.22 కోట్ల 44లక్షలా 12వేల 625లకు కొనుగోలు చేశారు. పరాధీనంలో ఉన్న భూములను సొంతం చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టం, న్యాయపరమైన చిక్కులే ఎక్కువని భావించి వేలం పాటలో వెనక్కు తగ్గినట్లు తంగుటూరి రామకృష్ణ, వెంకటేశ్వరావు తెలిపారు. కాంచీపురంలో 471 ఎకరాల భూమిని కలిగి ఉన్న ఏపీ ఎండోమెంటు శాఖ కేవలం 83.11 ఎకరాల భూమిని మాత్రమే సొమ్ముచేసుకుని 388 ఎకరాల భూమిని ఆక్రమితదారులకు అప్పగించేసిందని భావించవచ్చు. -
పూనేపల్లె ఘటనపై నిర్భయ కేసు
యువతిపై అత్యాచారం, హత్యకేసులో నిందితుడి అరెస్టు చిత్తూరు(అర్బన్): పెనుమూరు మండలం, కలవకుంట పంచాయతీ ఎగువ పూనేపల్లెకు చెందిన యువతి(18)పై జరిగిన అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి నిందితుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పలువురిని విచారించిన పోలీసులు చివరకు సోమవారం ఒక్కడినే నిందితుడిగా తేల్చారు. కలవకుంటకే చెందిన ఉదయకుమార్ మొదలియార్(23)పై కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసినందుకు ఐపీసీ-376, హత్య చేసినందుకు ఐపీసీ-302తో పాటు నిర్భయ యాక్టు కింద కూడా అతడిని అరెస్టుచేశారు. అంతేగాక ఆమె దళితురాలు కావడంతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదు చేశారు. సంచలనం రేకెత్తించిన ఈ కేసు వివరాలను రాష్ట్ర ఐజీ హరీష్, అనంతపురం డీఐజీ బాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ సోమవారం చిత్తూరులో విలేకరులకు వివరించారు. ఉదయ్‌కుమార్ మొదలియార్‌తో మృతురాలికి కొంతకాలంగా పరిచయాలు ఉన్నాయి. అతడు ఐటీఐ వరకు చదువుకుని వడ్రంగి పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం వీరు మాట్లాడుకుంటూ ఆ గ్రామ సమీపంలోనే పొదల్లోకి వెళ్లారు. లైంగింక వాంఛ తీర్చాలని అతడు కోరాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మొలతాడే తీసి గొంతుకు బిగించి చంపేసి పారిపోయాడు. దర్యాప్తు ఇలా... యువతిపై సమూహిక అత్యాచారం జరిగిందని, నిందితులు ఆరుగురని ప్రచారం జరిగింది. పోలీసు జాగిలం తొలుత ఊర్లోకి వెళ్లి ఆగిపోయింది. మరుసటి రోజు నిందితుడు ఉదయ్‌కుమార్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో పోలీసులు అతని ఇంట్లో వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ ఆమె ఫొటో ఉండటం, అతని సెల్‌ఫోన్ కాల్స్ లిస్టులో ఆమెతో పలుమార్లు మాట్లాడినట్లు ఉండడం పోలీసులు గుర్తించారు. దీంతో వీరికి కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు భావించారు. మృతురాలి ఇంట్లో ఒక పుస్తకంలో నిందితుడి సెల్‌ఫోన్ నెంబర్ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోవడానికి ముందు బామ్మతో కలిసి మేకలు మేపుతున్న ఆమె ఉదయ్‌కుమార్ రాగానే ఆమెను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పింది. హత్య చేసేప్పుడు ఆమె కేకలు విని అక్కడికి మరో మహిళ పరుగెత్తి వస్తుంటే..‘‘రాకు.. అక్కడే ఆగిపో, లేకుంటే నీకూ ఇదే గతి పడుతుంది’’ అని నిందితుడు గద్దించడంతో వె ళ్లిపోయింది. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, ఆ రోజు విన్న గొంతు ఇదేనని ఆమె పోలీసులకు సాక్ష్యం చెప్పింది. దాంతో అతడిని అరెస్టు చేశారు. కేసు త్వరితగతిన విచారణ చేపట్టడానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించాలని ఉన్నతాధికారులకు పోలీసులు నివేదిక పంపారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డీఎస్పీలు రామకృష్ణ, లక్ష్మీనాయుడు, సీఐలు చల్లనిదొర, చంద్రశేఖర్, ఆదినారాయణ, ఎస్ఐలు వాసంతి, రమణ, ఏఎస్ఐ హరినాథ్, కానిస్టేబుళ్లు వెంకటేశన్, ఖాదర్‌భాషా, సూర్యప్రకాష్, జయకుమార్, శ్రీనివాసులు, కుమార్‌రాజా, ప్రవీణ్, రఘురామ్, శ్రీహరి, మనిదండన్, రాజ్‌కుమార్‌కు ఐజీ, డీఐజీలు రివార్డులు అందచేసి అభినందించారు. -
ఆప్‌ను వీడిన ఉదయకుమార్
టీనగర్: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం వ్యతి రేక ఉద్యమకారుడు ఉదయకుమార్ వైదొలిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కన్యాకుమారిలో ఉదయకుమార్ పోటీ చేశారు. అయితే ఊహించిన స్పందన రాకపోవడంతో మళ్లీ ఉద్యమకారుడిగానే ప్రస్తానం కొనసాగించారు. ఈయనతోపాటు ఉద్యమంలో పాల్గొని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి నెల్లై నుంచి పోటీ చేసి ఎంపి జేసురాజ్, తూత్తుకుడి నుంచి పోటీ చేసిన పుష్పరాయన్లు చీపుర కట్ట చిహ్నంపై పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వారు వైదొలుగుతున్నట్లు ఉదయకుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులతోను, జాలర్ల గ్రామాల ప్రజలతోను సామాజిక నేతలతోను కలిసి చర్చించిన మీదట ఆమ్ ఆద్మీ పార్టీలో కొన్ని నిబంధనల మేరకు చేరామని అయితే రాష్ట్ర ప్రజల అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల పరిస్థితి, అణు కర్మాగారానికి వ్యతిరేకంగా పార్టీ అదిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీని గురించి పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌తో అనేకసార్లు చర్చించామని, లేఖలు రాశామన్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తాను ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. -
అసెంబ్లీలో దుమారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై విమర్శలతో రెవెన్యూ మంత్రి ఉదయకుమార్ మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో దుమారం లేపారు. తమ పార్టీ అధినేతపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించిన డీఎంకే సభ్యులు చివరకు సస్పెండ్‌కు గురయ్యారు. 2014-15 వార్షిక బడ్జెట్‌పై చర్చించేందుకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారంతో ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. లాజర్ (సీపీఎం), గుణశేఖర్ (సీపీఐ), వేలు (డీఎంకే), జవహరుల్లా (మనిదనేయ మక్కల్ కట్చి), సెంథిల్‌కుమార్ (డీఎండీకే), రంగరాజన్ (కాంగ్రెస్) తదితర సభ్యులు రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఏకరువుపెట్టారు. ప్రతిపక్షాల విమర్శలకు రెవెన్యూమంత్రి ఉదయకుమార్ మధ్యలో అడ్డుతగులుతూ, కరువు, కాటకాలు, వరదలు, సునామీలను సునాయాసంగా అధిగమించే నేర్పు, తల్లివంటి మనసు కలిగిన ముఖ్యమంత్రి జయలలితకు ఉందని అన్నారు. సునామీ సహాయక చర్యలతో ప్రపంచ దేశాల నుంచి ఆమె ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. సునామీ సంభవించినపుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చేతులెత్తేసి రహస్య ప్రదేశంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వ్యాఖ్యలతో ఆగ్రహించిన డీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. మంత్రి విమర్శలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుపట్టారు. సభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ పదే పదే ఆదేశించారు. దీంతో డీఎంకే సభ్యులు మరింత ముందుకు వచ్చి స్పీకర్‌ను ముట్టడించినంత పనిచేశారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, అధికార పక్ష సభ్యులు ప్రతినినాదాలు చేశారు. సభ్యులంతా ఒకరిపై ఒకరు చేతులు ఊపుకుంటూ వాగ్యుద్ధానికి దిగారు. దీంతో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ ప్రవేశించి డీఎంకే సభ్యులందరినీ బలవంతంగా వెలుపలకు పంపేశారు. డీఎంకే సభ్యులపై ఇప్పటికే మూడుసార్లు మార్షల్స్ ప్రయోగం చేయాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి వారిని మళ్లీ అనుమతించానని స్పీకర్ చెప్పారు. అయినా వారి ఆగడాలు మితిమీరిపోవడం వల్ల బడ్జెట్ సమావేశాల ప్రయోజనాన్ని కాపాడేందుకు డీఎంకే సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ఈ ప్రకటనకు నిరసన తెలుపుతూ సభలోని మిగిలిన ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. ఇదే సమయంలో మంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి ఉదయకుమార్ చెబుతున్నమాటలను వారు పట్టించుకోలేదని, స్పీకర్ నచ్చజెప్పినా వినిపించుకోనందుకు ప్రతిఫలంగా సస్పెండ్ తప్పలేదని చెప్పారు. ఆగ స్టు 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బుధవారం నుంచి డీఎంకే సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కానున్నారు. -
నామినేషన్ల పర్వం
చెన్నై, సాక్షి ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా శనివారం తమిళనాడు, పుదుచ్చేరీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ తొలిరోజున నామినేషన్ వేయలేదు. ఈనెల 5వ తేదీన ఎన్నికల షెడ్యూలు విడుదల కాగా ఒకే విడతలో ఈ నెల 24 వ తేదీన పోలింగ్‌ను ముగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిం చడం ప్రారంభించారు. ఉత్తర చెన్నై స్థానానికి ఎస్టీపీఐ అభ్యర్థి నిజాంముకై ద్దీన్, కోవై స్థానానికి సీపీఎం అభ్యర్థి పీఆర్ నటరాజన్, దిండుగల్లు స్థానానికి ఉళైప్పాలీ పార్టీ తరపున బాలసుబ్రమణియన్, తంజావూరు స్థానానికి వోలాలర్ మున్నేట్ర మున్నని అభ్యర్థిగా ఎన్ గుణశేఖరన్, కడలూరులో సీపీఐ అభ్యర్థి ఆర్ బాల సుబ్రమణ్యన్ నామినేషన్లు వేశారు. బాహ్య ప్రపంచంలోకి ఉదయకుమార్ కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్న ఉదయకుమార్, పుష్పరాయన్, నామినేషన్ల పర్వం జేసురాజన్ ఎన్నికల పుణ్యమా అని రెండున్నరేళ్ల తరువాత బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం వల్ల పర్యావరణ వినాశనం, ప్రజల ప్రాణాలకు విఘాతం అంటూ ఇడిందకరై గ్రామమే కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున పోరాటాలు ప్రారంభించారు. పోలీసుల నిషేధాజ్ఞలను ధిక్కరించి ఆందోళనలు సాగిస్తున్న వీరిపై సుమారు 400 కేసులున్నాయి. ఉద్యమకారులకు గ్రామస్తుల మద్దతు కారణంగా పోలీసులు వారిని అరెస్ట్ చేయలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత ప్రశాంత్‌భూషణ్ ఇటీవల ఉదయకుమార్ తదితరులను కలుసుకుని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ముగ్గురు ఉద్యమకారులు పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారం కోసం గ్రామం విడిచివెళితే అరెస్ట్ చేస్తారన్న సందేహంతో ఇటీవలే ముందస్తు బెయిల్‌కు మధురై హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పట్లో వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది స్పష్టం చేయడంతో వారంతా బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు. కన్యాకుమారి స్థానానికి ఉదయకుమార్, నెల్లైకు ఫాదర్ జేసురాజన్, తూత్తుకూడికి పుష్పరాయన్ శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ముహూర్తాలు పెట్టుకున్న పార్టీలు అన్నాడీఎంకే అభ్యర్థుల 1వ తేదీ మధ్యాహ్నం 1.30 నుండి 3 గంటల లోగా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎండీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీల అభ్యర్థులు సైతం అదేరోజున నామినేషన్లు వేస్తారు.కాంగ్రెస్, డీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లు 2వ తేదీ వేయనున్నారు. పీఎంకే, పుదియ తమిళగం పార్టీ 3న, డీఎంకే కూటమిలోని వీసీకే అధినేత తిరుమావళవన్ 4న, బీజేపీ కూటమిలోని డీఎండీకే 5న నామినేషన్ వేసేందుకు సుముహూర్తం పెట్టుకున్నారు. -
‘ఆప్’ తీర్థం
అణు వ్యతిరేక ఉద్యమ నాయకుడు ఉదయకుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఆయనతో పాటుగా పలువురు ఉద్యమ నాయకులు ఆప్ బాట పట్టారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ఇడిందైరె వాసులు వ్యతిరేకిస్తుండడంతో అణువ్యతిరేక ఉద్యమంలో చీలిక ఏర్పడింది. సాక్షి, చెన్నై: తిరునల్వేలి జిల్లా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదికగా పెద్ద ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ఉదయకుమార్, పుష్పరాయన్, ఏసురాజన్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు నిర్ణయించారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అణు విద్యుత్ కేంద్రాలను దేశంలో నెల కొల్పొద్దంటూ నినదిస్తున్న ఆమ్ ఆద్మీలోకి చేరాలని నిర్ణయించారు. ఆపార్టీ సీనియర్లతో ఢిల్లీలో మంతనాలు జరిగాయి. అణు వ్యతిరేక ఉద్యమకారులు ఆప్ తీర్థం పుచ్చుకోవడంతో పాటుగా ఆపార్టీ తరపున రా ష్ట్రంలో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అయ్యారు. తీర్థం: ఇడిందకరై వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఉదయకుమార్, పుష్పరాయన్, ఏసురాజన్తో పాటుగా ఆ పరిసర గ్రామాల ప్రజలు ఆమ్ ఆద్మీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ టోపీ ధరించి, చీపురు చేతబట్టారు. చీపురు సాయంతో రాష్ట్రం నుంచి అణు విద్యుత్ కేంద్రాన్ని తరిమి కొడతామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల బరిలో పోటీకి సిద్ధమవుతున్నామని ప్రకటించారు. ఈ మూడు స్థానాల కైవసంతో అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమానికి బలం చేకూరినట్టు అవుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యతిరేకత: ఉద్యమ నాయకులు రాజకీయబాట పట్టడంతో పరిస్థితులు ఉద్యమంలో చీలిక కు దారి తీస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని ఇన్నాళ్లుసాగిస్తూ రాగా, ప్రస్తుతం నేతలు ఆప్‌లోకి వెళ్లడంతో వ్యతిరేకత బయలు దేరింది. ఏళ్ల తరబడి ఉద్యమంలో పాల్గొంటూ వస్తున్న వారిలో ఓ వర్గం రాజకీయ బాటను తీవ్రంగా వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. తామంతా ఏళ్ల తరబడి ఉదయకుమార్‌కు అండగా ఉంటూ వస్తుంటే, ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం ఎంత వరకు సమంజసమంటూ ఇడిందకరై పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో చర్చ మొదలైంది. ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా ఆ గ్రామాల ప్రజలు తప్పుబడుతున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చడం లక్ష్యంగా ఈ కుట్ర పన్నినట్టుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరణ: తమకు గ్రామాల్లో వ్యతిరేకత బయలుదేరడంతో ఉద్యమ నేతలు కంగు తిన్నారు. ప్రజల అండదండలతో ఓట్లు రాబట్టుకోవచ్చన్న ఆశతో ఉన్న నాయకులు డైలమాలో పడ్డారు. ఎట్టకేలకు ప్రజలను బుజ్జగించే రీతిలో ఉద్యమం తమ చేతిలోనే ఉందని చాటుకునే పనిలో పడ్డారు. ఉదయకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు వివరణ ఇచ్చారు. ఉద్యమంలో ఎలాంటి చీలిక ఏర్పడ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా, తమకు ఉద్యమమే కీలకమని పేర్కొన్నారు. ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సి వస్తున్న దృష్ట్యా, ఆప్‌లోకి చేరాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే, అణు ప్రాజెక్టుల్ని మరింత వేగవంతం చేయడం తథ్యమన్నారు. ఒక వేళ బీజేపీ పగ్గాలు చేపట్టిన పక్షంలో ఉద్యమాన్ని ఉక్కు పాదంతో వాళ్లు అణచి వేస్తారని చెప్పారు. అందువల్లే ప్రత్యామ్నాయంగా ఉద్యమానికి మద్దతుగా, అణు విద్యుత్‌కు వ్యతిరేకంగా ముందుకె ళుతున్న ఆప్‌లోకి చేరాల్సి వచ్చిందన్నారు. ఇక్కడి నుంచి ఉద్యమ ప్రతినిధులు పార్లమెంట్లో అడుగు పెట్టిన పక్షంలో, కూడంకులం కేంద్రాన్ని తప్పకుండా మూసి వేయించ గలరని, ఇందుకు ఆప్ అధినేత కేజ్రీ వాల్ సైతం హామీ ఇచ్చారంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.